Rangbali OTT Release :
యంగ్ అండ్ ప్రామిసింగ్ తెలుగు హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం రంగబలి 7 జూలై, 2023న విడుదలై మెజారిటీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. బసంశెట్టి పవన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో యుక్తితరేజా హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ డెబ్యూ డేట్ లాక్ అయింది. ఈ చిత్రాన్ని 4 ఆగస్టు, 2023న విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, మురళీశర్మ, కళ్యాణి నటరాజన్, సప్తగిరి, సత్య, బ్రహ్మాజీ, రాజ్కుమార్ కసిరెడ్డి, గోపరాజు రమణ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సీహెచ్ సంగీత దర్శకుడు.