
Rashmika : సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై తాజాగా వైఎస్ఆర్సీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్దకు ఎక్కువ మంది రావడానికి కారణం రష్మిక మందన్న కావొచ్చుగా. ఆమెను చూడటానికే అంత మంది వచ్చి ఉంటారని అనుకోవచ్చుగా. అలా ఎవరు అనుకోలేదు. ఆమెపై కేసు కూడా పెట్టలేదు అని ఆయన అన్నారు.
‘‘రష్మిక వల్ల తొక్కిసలాట జరిగిందనే కొత్త వాదనను సమర్ధించుకొంటూ.. ఆమె నేషనల్ క్రష్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూడటానికి బాగుంటాడా? గడ్డం పెంచి.. డీ గ్లామర్‌గా కనిపించాడు. ఆయనను చూడటానికి ఎవరు వస్తారు. రష్మికను చూడటానికే వెళ్లి ఉంటారని అనుకోవచ్చుగా’’ అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.






