Ratan Tata : టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా పశు పక్షాదులకు కూడా ప్రేమను పంచేవారు. ప్రపంచంలోనే అత్యంత విలాశవంతమైన, అందమైన హోటల్ తాజ్. ఈ హోటల్ టాటా గ్రూపునకు చెందినదని తెలిసిందే కదా.. అక్కడికి సాధారణ వ్యక్తులు వెళ్లడమే కష్టం కానీ రోజూ రతన్ టాటా కోసం కుక్కులు వెళ్లేవట. రతన్ టాటా వాటికి ఫుడ్ పెట్టాలని తాజ్ నిర్వాహకులకు ఆర్డర్ వేశారట. అందుకే ఆయన వస్తున్నాడంటే.. తాజ్ వద్ద హడావుడి మొదలవుతుంది. హడావుడి మొదలైందంటే చాలు అక్కడికి కొన్ని కుక్కలు వచ్చేవట. రతన్ టాటాను చూసి భక్తితో మొరిగేవట. ఈ రోజు కూడా (ఆయన మరణం తర్వాత) హోటల్ పరిసరాల్లోకి కుక్క వచ్చినా సిబ్బంది వాటిని తరమకుండా చూస్తూ ఉన్నారు. ఈ ఒక్క ఘటన చాలు ఆయనకు మనుషులే కాదు భారత్ లోని ప్రతీ ఒక్క జీవిపై ఎంత ప్రేమ ఉందో తెలిపేందుకు. ఎంతైనా గొప్పోళ్ల కడుపులో గొప్పోల్లే పుడతారనేందుకు ఇదే చక్కటి ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram