33.9 C
India
Friday, March 29, 2024
More

    రవితేజకు ఆ సినిమా సరిపోలేదు.. పరుచూరి సంచలన వ్యాఖ్యలు..

    Date:

    ravanasura Movie Telugu review
    ravanasura Movie

    రిలీజ్ సినిమాలకు రివ్యూలు సినీ విశ్లేషకులు, కొన్ని వెబ్ సైట్లు రాస్తుంటే.. ఆల్ రెడీ రిలీజ్ అయి జనాల్లోకి వెళ్లిన సినిమాలకు రివ్యూలను పరుచూరి గోపాలకృష్ణ. గతంలో ‘రంగమార్తండ’ను బాగా విశ్లేషించిన ఆయన బ్రహ్మానందం నటన నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్ అని సర్టిఫికెట్ ఇచ్చాడు. సినిమాలో మంచీ, చెడులను పూసగుచ్చినట్లుగా వివరించారు గోపాలకృష్ణ.

    రీసెంట్ గా రిలీజై మోస్తారుగా ఆడుతున్న రవితేజ ‘రావణాసుర’ గురించి రివ్యూ ఇచ్చారు పరుచూరి. ఈ సినిమా ఆయన బాడీ లాంగ్వేజ్ కు అస్సలు సరిపోలేదని చెప్పారు. ప్రస్తుతం సినిమా డైరెక్టర్లు ఎథిక్స్ ను కొంచెం మరిచినట్లు కనిపిస్తుందన్నారు. సినిమాలో క్రిమినల్ పాత్రను గొప్పగా చూపించవద్దని, ఒక వేళ కథ డిమాండ్ చేస్తే సదరు పాత్రకు చట్ట పరంగా శిక్ష పడేలా చూపిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ‘‘రావణాసుర’ కథ ఒక బెంగాళి సినిమా నుంచి అరువు తెచ్చుకున్నట్లు తెలిసింది. ఇది నిజమా..? అనేది నాకు తెలియదు, అదే నిజమైతే దీనికి మూలమైన రచయిత పేరును టైటిల్ లో వేసి ఉంటే బాగుండేది. ఈ మధ్య చాలా సినిమాలు ఈ కనీస సూత్రాన్ని పాటించడం లేదు. రచయితకు కూడా మంచి గుర్తింపు దక్కాలి. అది సినిమా అయినా పుస్తకమైనా దక్కి తీరాల్సిందే’.

    Ravanasura కథ విషయానికొస్తే..

    ఇక కథ విషయానికి వస్తే ఒక డ్రగ్ వలన పిచ్చిపట్టిన తండ్రి.. కన్న బిడ్డ చనిపోతున్నా నవ్వుతూ చూస్తుండడం, బిడ్డ చనిపోవడం చూసి తల్లి కూడా మరణించడం. దీనికి కారణమైన వారందరినీ హీరో మట్టుబెట్టడం. ఇది పాత కథే. పగా, ప్రతీకారం నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. అందులో చాలా సినిమాలు సక్సెస్ కూడా సాధించాయి. కానీ రావణాసుర మాత్రం ఫ్లాప్ అయినట్లు తెలిసింది. తన కుటుంబానికి జరిగిన అన్యాయం. అందుకు బాధ్యులను చంపడం ఇదే సినిమా ఫ్లాట్.. దీని చుట్టూ స్ర్కీన్ ప్లే అల్లుకుంటూ పోయాడు దర్శకుడు. కోర్టులో సాక్షులనుప్రవేశపెట్టే సీన్ లో అసలు వాడిని కాకుండా తఖిలీ వాడిని ప్రవేశపెడతాడు హీరో.. ఈ సీన్ తోనే సినిమా పట్టుతప్పింది.

    ఇది అనవసరమైన ఫైట్. ఈ ఫైట్ కు ప్రతిఫలం చేకూరలేదు.
    -ఇక మాస్ మహరాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పర్లేదు. ఆయన నటన విలక్షణంగా ఉంటుంది. డైలాగ్స్, ఫైట్స్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్నీ ఉంటాయని ప్రేక్షకులు సినిమాకు వస్తుంటారు. కానీ ఇందులో అవి అంతగా లేవు. అసలు రవితేజ బాడీ లాంగ్వేజ్ కే ఈ సినిమా ఫిట్ కాలేదు.
    -ఈ సినిమాలో చాలా వరకు కట్ సీన్స్ ఉన్నాయి. ఒక సీన్ అనుభూతి పొందే వరకూ మరో సీన్ రావడంతో ప్రేక్షకుడు కన్ ఫ్యూజన్ కు గురవుతాడు.
    -మర్డర్ సీన్స్ బాగానే పెట్టాడు దర్శకుడు. చాలా సినిమాల్లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు హంతకుడు పలు వేషాల్లో తిరుగుతుంటాడు. ఇందులో ఆ ఫ్లాట్ ఉంది. కానీ హత్యలన్నీ మూస ధోరణిలో చేస్తున్నట్లు అనిపిస్తుంది.
    -ఈ మూవీతో అనవసరమైన సందేహం సీనీ ప్రేక్షకుల్లోకి వెళ్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎన్ని హత్యలు చేసినా పోలీసులు పట్టుకోలేరు అని. అయితే గతంలో చాలా సినిమాల చివరలో హంతకులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో చిరి సీన్ లో కూడా అది పెట్టలేదు దర్శకుడు. దీని ద్వారా బ్యాడ్ మెసేజ్ సమాజంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. సుశాంత్-ఆయన లవర్ పాత్రను ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Box Office : బాక్సాఫీస్ వద్ద డల్ వీకెండ్.. ఫస్ట్ 5 పై ఓ లుక్కేయండి

    Box Office  Weekend : ఈగల్ : మాస్ మహరాజ్ రవితేజ...

    Ravi Teja Eagle : ఈగిల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?

    Ravi Teja Eagle : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,...

    Eagle : అనుకున్నదే అయ్యింది.. ఈగల్ అవుట్..

    Eagle : ఈ సారి సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ...

    Ravi Teja Comedy : మాస్ మహరాజ రవితేజతో అనుదీప్! మారో కామెడీకి శ్రీకారం

    Ravi Teja Comedy : మాస్ మహరాజ రవితేజ ఇటీవల రిలీజైన...