
Ravi Teja New Movie : అనుదీప్ కేవి.. ఈ డైరెక్టర్ పేరు అందరికి బాగానే రిజిస్టర్ అయ్యింది.. ఈయన మంచి దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు.. కేవీ అనుదీప్ ఒక్క సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమానే ”జాతిరత్నాలు”.. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.. ఈ సినిమాను అనుదీప్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.
జాతిరత్నాలు సినిమా సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. ఇక అనుదీప్ ఈ సినిమా తర్వాత తమిళ్ హీరో శివకార్తికేయన్ తో ప్రిన్స్ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమా జాతిరత్నాల రేంజ్ లో హిట్ కాలేక పోయింది. అయినా కూడా అనుదీప్ పై ఫ్యాన్స్ లో ఏ మాత్రం అంచనాలు తగ్గలేదు.
ప్రిన్స్ తర్వాత మరో సినిమా చేయని అనుదీప్ ఇప్పటి వరకు ఎలాంటి కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించలేదు.. అయితే తాజాగా ఈయన కొత్త ప్రాజెక్ట్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఒక స్టార్ హీరోతో అనుదీప్ తన మూడవ సినిమా చేయబోతున్నట్టు నిన్నటి నుండి ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
మరి ఆ స్టార్ హీరో ఎవరంటే మాస్ మహారాజా రవితేజ అని తెలుస్తుంది.. అనుదీప్ రవితేజ కోసం ఇప్పటికే కథ కూడా రెడీ చేసి ఆయనకు వినిపించారట.. మరి మంచి కథలను ఎప్పుడూ ఆదరించే రవితేజ ఈ సినిమా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.. ఈ క్రేజీ కాంబోపై ఇప్పుడు అందరిలో అంచనాలు పెరుగు తున్నాయి.. ఈ కాంబోలో మూవీ వస్తే ఇండస్ట్రీ హిట్ గ్యారెంటీ అంటున్నారు. చూడాలి ఈ కాంబో ఎప్పుడు ప్రకటిస్తారో..!