Ravi Teja’s remuneration :
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు రవితేజ. మాస్ మహరాజ్ గా బిరుదు దక్కించుకొని ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు. డైరెక్టర్ కృష్ణవంశీ, బ్రహ్మాజీతో ఆయనకు మంచి స్నేహం ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. సింధూరం, నిన్నే పెళ్లాడతా, అన్నయ్య, ఇలా చేస్తూ మెప్పించాడు. పూరీ జగన్నాథ్ కన్నుల్లో పడిన ఆయన ‘ఇడియట్’తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ ను మలుపుతిప్పింది. అంతకు ముందు ‘నీ కోసం’ లాంటి సినిమాలు ఉన్నా ఆయనకు మంచి బ్రేక్ ఇవ్వలేదు.
రవితేజకు ఈ మధ్య కలిసి రావడం లేదు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాగా సరిగా ఆడలేదు. కానీ మాస్ మహరాజ్ ను చూసేందుకు మాత్రం ప్రేక్షకులు ఎగబడ్డారు. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా రాను రాను బాగా డల్ అయ్యాయి. ఇక ‘వాల్తేరు వీరయ్య’లో మంచి స్కోప్ ఉన్న పాత్రే అయినా మెగాస్టార్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఆయన కూడా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ‘రావణాసుర’ ఆశించినంత ఆడకపోయినా దాని రిజల్ట్‌తో సంబంధం లేకుండా రవితేజ రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. రావణాసురతో కలిపి ఇప్పటి వరకు ఆయన ఒక్కో సినిమాకు రూ. 17 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇక తర్వాత వచ్చే సినిమాలకు ఆయన రెమ్యునరేషన్ రూ. 8కోట్ల వరకు పెంచారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అంటే ఇప్పుడు ఆయనతో సినిమా తీయాలంటే రూ. 25 కోట్ల వరకూ చెల్లించాలన్నమాట.
ఇది పక్కన పెడితే ఇటీవల ఒక నిర్మాణ సంస్థ రవితేజకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసిందట. పీపుల్స్ మీడియా సంస్థ రూ. 100 కోట్లు ఇస్తామని చెప్పారట. అయితే ఇది ఒక్క సినిమాకు కాదు. ఈ సంస్థ రవితేజతో కలిసి 4 సినిమాలు చేస్తుంది. ఇందుకు రూ. 100 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని టాక్ చెక్కర్లు కొడుతోంది. అయితే, ఇప్పటి వరకు సదరు సంస్థ గానీ, రవితేజ గానీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
రవితేజ ప్రస్తుతం వంశీకృష్ణ డైరెక్షన్ లో (టైగర్ నాగేశ్వర్ రావు’ చేస్తున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉంటుంది. దీంతో పాటు కెమెరామన్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ మూవీలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది.