Ten years of ICC Champions :
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ చరిత్రలో జూన్ 23 టీమ్ ఇండియాకు చాలా ప్రత్యేకమైన రోజు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో, టీం ఇండియా 23 జూన్ 2013న ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రియేట్ చేసిన ఈ రికార్డును తదుపరి కెప్టన్లు ఇప్పటివరకు బ్రేక్ చేయలేకపోయారు. . కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని 23 జూన్ 2013న ICC ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత 3 విభిన్న ICC ట్రోఫీలను గెలుచుకున్న ప్రపంచంలోనే మొదటి కెప్టెన్ అయ్యాడు. 2013కి ముందు మహేంద్ర సింగ్ ధోనీ 2011 ప్రపంచకప్, 2007 టీ20లను గెలుచుకున్నాడు.
2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌ను 20-20 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులకే కుప్పకూలింది. ఆ విధంగా టీం ఇండియా విజయం సాధించింది.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2013 నుండి, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల నాయకత్వంలో టీమ్ ఇండియా మొత్తం 9 ICC టోర్నమెంట్లలో పాల్గొంది. ఇందులో 8 సార్లు సెమీఫైనల్, ఫైనల్స్‌కు చేరుకోగలిగింది. అయినా ఇప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ గ్రూప్ దశకు చేరుకోలేకపోయింది.
జడేజా ట్వీట్
2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తాను సాధించిన వ్యక్తిగత ట్రోఫీలతో ఉన్న ఓ ఫొటోను జడేజా పోస్ట్ చేశాడు. “గోల్డెన్ బాయ్” అంటూ క్యాప్షన్ పెట్టాడు. హ్యాష్ ట్యాగ్‍తో “మిషన్ కంప్లీటెడ్” అని రాసుకొచ్చాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టినందుకు గాను జడేజాకు గోల్డెన్ బాల్ ట్రోఫీ దక్కింది. అలాగే ఇంగ్లండ్‍తో జరిగిన ఫైనల్‍లో బ్యాటింగ్‍లో, బౌలింగ్‍లో అదరగొట్టినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
2013లో, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ధోనీ బృందం ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ – 2013 ఫైనల్ మ్యాచ్ ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో మొదటి టెస్ట్ జరిగిన ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగింది. ఇంగ్లండ్‌ను సొంత గడ్డపై ఓడించడం విశేషం. దీంతో వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన భారత కెప్టెన్‌గా ధోనీ అరుదైన ఘనత సాధించాడు.
ఐదు పరుగుల తేడాతో..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై చివరి బంతి వరకు పోరాడిన ఇండియా జయకేతనం ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 129/7 మాత్రమే చేసింది. అప్పటి యువ క్రికెటర్లు విరాట్ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33), శిఖర్ ధావన్ (31) రాణించారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ధోని డకౌట్ గా పెవిలియన్ చేరాడు. విరాట్-జడ్డూ ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. భారత్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఇంగ్లండ్ పై ఉమేష్ తొలి దెబ్బ కొట్టాడు. కుక్ దిగి శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత అశ్విన్, జడేజా, ఇషాంత్ స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేశారు. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా 124/8 స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన భారత్ మరో ట్రోఫీని గెలవలేదు. 2015, 2019లో ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకున్నప్పటికీ కప్ గెలవలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు ఫైనల్‌కు చేరిన టీమిండియా.. విజేతగా నిలవలేకపోయింది. వన్డే ప్రపంచకప్ 2023 ఈ ఏడాది భారత్‌లో ప్రారంభం కానుంది. ఇందులో విజయం సాధించి పదేళ్ల నిరీక్షణకు తెరపడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ReplyForward
|