
Bro item song : మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్లో పవర్ స్టార్ ఒకరు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.. మెగా హీరోల్లో ఒకరైన పవన్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.. అయితే మెగా ఫ్యామిలీ నుండి మల్టీస్టారర్ చేస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఆశ పడుతుంటారు.. మరి ఫ్యాన్స్ ఆశలను నిజం చేస్తూ తాజాగా ఒక మెగా మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..
పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఒక సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వినోదయ సీతం అనే రీమేక్ సినిమా అనే విషయం తెలిసిందే.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఎప్పటికప్పుడు అప్డేట్ లను అందిస్తూ ఆడియెన్స్ లో క్రేజ్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మరో క్రేజీ అప్డేట్ షికారు చేస్తుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకోవడంతో ఈ స్పెషల్ సాంగ్ పై మేకర్స్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది..
ఈ సాంగ్ పవన్, సాయి ధరమ్ తేజ్ లపై ప్లాన్ చేసిన ఒక పబ్ సాంగ్ అట.. ఈ పాటలో ఈ ఇద్దరు హీరోలతో స్టెప్పులు వేసేందుకు ఐటెం సాంగ్ ల స్పెషలిస్ట్ ఊర్వశి రౌటేలా రంగంలోకి దిగుతుందట. ఇప్పటికే పబ్ సెట్ కూడా వేసారని సమాచారం.. ఈ సాంగ్ థియేటర్స్ దద్దరిల్లేలా ఉంటుందట.. చూడాలి మరి ఊర్వశి స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారో లేదో..






