
రాజ్ అండ్ కోటీ.. తెలుగు ఇండస్ట్రీలో ఈ జంట సంగీత దర్శకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ జంట సంగీత దర్శకులు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు అనే చెప్పాలి.. ఈ ఆదివారం సంగీత దర్శకుడు రాజ్ మరణించిన విషయం తెలిసిందే..
తన సోదరుడితో సమానం అయిన ఈయన మరణ వార్త విన్న కోటీ కన్నీటి పర్యంతం అయ్యారు.. ఈ ఇద్దరి ద్వయం ఎన్నో అద్భుతమైన పాటలను ఇండస్ట్రీకి ఇచ్చింది.. ఇప్పటికీ వీరు చేసిన పాటలు ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అలాంటి రాజ్ ఇక లేరు అనే వార్తను తెలుసుకున్న కోటీ ఈ హఠాత్పరిణామానికి షాక్ అయ్యారు.. ఈయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు..
మరి రాజ్ – కోటీ ఎన్నో పాటలను అందించి మధ్యలోనే వీర్ బంధాన్ని ఎందుకు విడిపోయారో మీకు తెలుసా.. ఈ సందర్భంగా కోటీ మాట్లాడుతూ.. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం.. చక్రవర్తి దగ్గర అసిస్టెంట్స్ గా చేసాము.. మా కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి..
అలాంటి రాజ్ ఈ రోజు లేరు అంటే నాకు చాలా బాధగా ఉంది.. ఈ వార్తను జీర్ణించుకోలేక పోతున్నాను.. కాల ప్రభావం, పరిస్థితుల కారణంగా మేం విడిపోయాం.. మేము విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంది.. వద్దురా విడిపోవద్దు అని రాజ్ చెప్పిన అప్పటి పరిస్థితుల కారణంగా మేం విడిపోయాం.. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికి బ్రతికే ఉంటారు” అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు..