
Refusing sex : భార్య భర్తల బంధం ఈ మధ్య ఎగతాళిగా మారిందని చెప్పవచ్చు. ఒకప్పుడు భర్తలపై పదుల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు వేలు దాటి లక్షలకు చేరింది. చట్టాలు తమకే అనుకూలంగా ఉన్నాయిని భావిస్తున్న భార్యలు భర్తలపై ఆమె కుటుంబ సభ్యులపై కేసులు పెడుతూ మానసిక వేధనకు గురి చేస్తు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. భర్త తప్పు చేస్తే అతన్ని జైలుకు పంపడంలో అర్థం ఉంది. కానీ ఎటువంటి తప్పు చేయని భర్తలను అత్తింటి వారిని లొంగదీసుకునేందుకు కేసులు పెట్టడంపై సంఘ సంస్కర్తల నుంచి మహిళా మండలి సభ్యులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భార్యా, భర్తలు ఒక గడపలో సంసారం చేస్తే సమస్యలు బయటకు పొక్కకుండా ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు అది జరగడం లేదు. చిన్న గొడవ అయినా భార్య, లేదా భర్త వీధికెక్కుతూ రచ్చ చేస్తున్నారు. ఇద్దరూ ఈగోలకు పోయి సంసారం వీధి పాలు చేసుకుంటున్నారు. నచ్చ జెప్పే పెద్దలు కూడా ఎవరి తరుపు వారు వకాల్తా పుచ్చుకొని సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. చివరికి పంచాయతీలకు చేరి విడాకుల వరకూ దారి తీస్తుంది. పైగా ఈ మధ్య న్యూక్లియర్ ఫ్యామిలీలు కావాలని కోరుకునే అమ్మాయిల జాబితా ఎక్కువైంది. ఇది కూడా సంసారం కరాబు చేసుకునేందుకే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
కోర్టు కెక్కిన భార్య భర్తల విషయంలో కోర్టులు పలు సందర్భాల్లో సంచలన తీర్పులను వెలువరుస్తున్నా సంబంధిత వ్యక్తుల్లో మాత్రం మార్పు రావడం లేదని తెలుస్తోంది. తల్లిదండ్రులను దూరం చేయాలని చూస్తే సదరు భార్యకు విడాకులు ఇవ్వచ్చు, భరణం కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటూ అత్యున్నత న్యాయస్థానమే తీర్పు ఇచ్చింది. అయినా అత్తా, మామ తమతో ఉండద్దని ఎన్నో కేసులు కోర్టుల్లో మూలుగుతూనే ఉన్నాయి.
రీసెంట్ గా ఒక భార్య క్రూరత్వాన్ని ఉద్దేశిస్తూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సరైన కారణం లేకుండా భాగస్వామిని ఎక్కువ కాలం సెక్స్ కు అనుమతించపోవడం మానసిక క్రూరత్వమేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత తన భార్య ప్రవర్తన, నడవడిలో మార్పు వచ్చిందని, తనతో సెక్స్ లో పాల్గొనకుండా దూరం పెడుతుందని ఆమె నుంచి విడాకులు కావాలని ఒక వ్యక్తి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఫ్యామిలీ కోర్టు తీరును తప్పుపట్టిన హైకోర్టు ఆయనకు విడాకులు మంజూరు చేసింది.