Pan india star : స్టార్ హీరోల చిన్ననాటి ఫొటోలు అప్పుడప్పుడూ ఫ్యాన్స్ బుర్రలకు పదునుపెడుతుంటాయి. ఒక్కసారి సోషల్ మీడియాలోని వివిధ ఖాతాల్లో ప్రత్యక్షమైందా.. ఇక దాని చుట్టూ కథలు పుడుతూనే ఉంటాయి. ఈ చొన్నోడు ఆ హీరో, ఈ చిన్నది ఈ హీరోయిన్ ఇలా చివరికి నిజం తెలుసుకొని ముక్కుమీద వేలేసుకుంటారు.
ఇవన్నీ పక్కన ఉంచితే ఇక్కడ సైకల్ పై కూర్చున్న చిన్నోడు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. ఆయన కుటుంబం మొత్తం ఇండస్ట్రీలో ఉంది. ఆయన తాత ప్రఖ్యాత కమేడియన్, తండ్రి ప్రొడ్యూసర్, ఇక మామ మెగాస్టార్, అతని తమ్ముడు కూడా ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్న మరోస్టార్. ఇప్పటికైనా గుర్తు పట్టారా అతను ఎవరో. అతనే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
ఆయన నటించిన సినిమాలు దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్లే. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకోవడంలో ఆయన ధిట్ట. సినిమా సినిమాకు క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేయడం ఆయన స్టయిల్. ఆయనకు అమ్మాయిల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇక ‘పుష్ప’ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా మిగిలే ఉంటుంది.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రీలీజ్ అయ్యింది. ఆ తర్వాత పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలని ఒత్తిడి పెరగడంతో మూడు నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు. దీంతో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇప్పుడు ‘పుష్ప-2’ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆతృతగా వేచి చూస్తున్నారు.
ఈ సినిమాలో రష్మిక మందన్నా అల్లు అర్జున్ సరసన నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇటీవల ఫహద్ ఫాజిల్ పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్. గతంలో టీజర్ సైతం విడుదల చేశారు. దీంతో మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి.