
Prabhas Italy villa : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటలీలో ఓ విల్లా కొన్నాడు. షూటింగ్ లేని తీరిక సమయాల్లో స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. దీనిపై అద్దెల రూపంలో కూడా భారీగా డబ్బులు వస్తున్నట్లు చెబుతున్నారు. షూటింగ్ ల కోసం వెళ్లినప్పుడు కూడా అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఒక ప్రాజెక్టు తరువాత మరో ప్రాజెక్టు ముమ్మరంగా ముందుకు నడిపిస్తున్నారు.
ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న ప్రభాస్ తరువాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. నాగ్ అశ్విన్ తో కూడా పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్టు కే లో నటిస్తున్నాడు. ఇలా సినిమాల నిర్మాణంలో వేగం పెంచారు. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ప్రభాస్ ఇటలీలో ఓ పెద్ద విల్లా కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన సంపాదనలో కొంత భాగాన్ని ఇటలీలో పెట్టుబడిగా పెట్టారట. ఓ లగ్జరీ విల్లా కొనుగోలు చేసి షూటింగుల సమయాల్లో ఫ్రెండ్స్ తో కలిసి అక్కడకు వెళ్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభాస్ షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు విల్లాను అద్దెకు ఇస్తున్నాడట. విల్లాకు నెలకు అద్దె రూ. 40 లక్షలు వస్తుందంటే ఇదో వ్యాపారం లా చేస్తున్నాడు.
ప్రభాస్ తన కెరీర్ ను మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాబోయే సినిమాలు హిట్ చేసుకోవాలని తపిస్తున్నాడు. బాహుబళి తరువాత తనక హిట్ లేదు. దీంతో నెక్ట్స్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఆశిస్తున్నాడు. దీని కోసం సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మంచి దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు.






