
Renu Desai Injuries : పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడిపోయినా ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం వారు కలిసే ఉంటారు. అందుకే రేణు దేశాయ్ ని వారు ప్రేమగా వదినా అని పిలుచుకుంటారు. పవన్, రేణుది లవ్ మ్యారేజ్ బద్రి సినిమాలో కలిసి నటించిన వీరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు. తర్వాత పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తర్వాత వారు విడిపోయారు. ఇవన్నీ వెంట వెంటనే జరిగాయి.
పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ కు ఇద్దరు పిల్లలు అకీరానందన్, ఆద్య ఉన్నారు. సోషల్ మీడియాలో రేణు దేశాయ్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు పవన్, తన ఫ్యాన్స్ ను పలకరిస్తుంటుంది. పవన్ కళ్యాణ్ పిల్లల పిక్ లను అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్‌టైన్ చేస్తుంది రేణు దేశాయ్. చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు ఆమె దూరమయ్యారు. ఈ టీవీలో వచ్చిన ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్న ఆమె తన, తన భర్త లైఫ్ స్టయిల్ తదితరాలను చెప్పుకచ్చారు.
రీసెంట్ గా అకీరానందన్ జిమ్ చేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియా వేధికగా ఇన్ స్టాలో స్టోరీగా అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ఫుల్ వ్యూవ్స్ తో భారీ స్పందన లభించింది. పవన్ లెగసీ ఇండస్ట్రీలో దూసుకెళ్తుందని చాలా కామెంట్లు చేశారు నెటిజన్లు, ఫ్యాన్స్. ఆయనను కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనే రేణు దేశాయ్ చాలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీకి చాలా కాలంగా దూరంగా ఉన్న రేణు దేశాయ్ మళ్లీ వస్తుంది. అయితే హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వస్తున్నట్లు తెలిసింది. రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఆమె కనిపించబోతోందని తెలుస్తోంది. ఆమె పాత్ర కూడా కీ రోల్ పోషిస్తుందని సమాచారం. ఈ మూవీ షూటింగ్ లో ఆమెకు గాయాలయ్యాయని తెలుస్తోంది. తన కాళ్లకు బాగా గాయలై వేళ్లు కూడా దెబ్బతిన్నాయని ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పుకచ్చింది. ఆమె ఈ పోస్ట్ పెట్టినప్పటి నుంచి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.