
మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు అదృష్టం పడిశం పట్టినట్లు పట్టిందనే చెప్పాలి. గతంలో సీఎస్ గా సొంత ప్రాంతం (ఆంధ్రప్రదేశ్)కు వెళ్లాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో వెళ్లిన ఆయన కొంత కావాలనికే స్వచ్ఛంద విమరణ తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. సీఎం వ్యక్తిగత సలహాదరుగా నియమించినట్లు వార్తలు వినిపించాయి. కాగా ఈ రోజు (మే 10) ఆయన బాధ్యతలపై ఒక క్లారిటీ వచ్చింది.
ముఖ్యమంత్రి ముఖ్య సలహదారుడిగా Somesh కుమార్ కు పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్. అయితే ఈ స్థానంలో ఇప్పటికే రాజీవ్ శర్మ కొనసాగుతున్నారు. అయితే రాజీవ్ శర్మకు పూర్తిగా పాలనా వ్యవహారాలను అప్పటించి పార్టీ వ్యవహారాలను సోమేశ్ కు అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా సోమేశ్ కు బీఆర్ఎస్ పార్టీని ఉత్తరాదిలో విస్తరించే బాధ్యతలను అప్పటించినట్లు తెలుస్తోంది. సోమేశ్ కు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. గతంలో ఆయన కేసీఆర్ తరుఫున చాలా సర్వేలు నిర్వహించారు. ప్రశాంత్ కిషోర్ కు సోమేశ్ కుమార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ ఉత్తరాదిలో పట్టుకోసం పావులు కదుపుతుంది. కేసీఆర్ దేశరాజకీయాల్లోకి వెళ్లినప్పటి నుంచి ఇతర రాష్ర్టాల్లో పార్టీని విస్తరిస్తున్నారు. ఇన్నాళ్లు ఆయనకు సపోర్టుగా నిలిచిన వారికి ఎంచుకొని ఆయా రాష్ర్టాల బాధ్యతలను అప్పగిస్తున్నారు. దాదాపు 2014 నుంచి సోమేశ్ కుమార్ కేసీఆర్ కు చాలా విషయాలలో సలహాలు ఇచ్చారు. సోమేశ్ ను పార్టీ విస్తరణకు వాడుకోవాలా లేక.. తన ముఖ్య సలహాదారుగా వాడుకోవాలా..? అంటూ పార్టీలో కూడా విస్తృతంగా చర్చించారు కేసీఆర్. అయితే పార్టీ చూసన మేరకు చివరికి ముఖ్య సలహాదారుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే సభలు, సమవేశాల నిర్వహణ తదితరాల్లో ఆయన జోక్యం ప్రముఖంగా ఉంటుందని కూడా తెలుస్తోంది.






