
అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతున్నది. అక్కడ ఆయన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో బ్రహ్మరధం పడుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోదీ భేటీ నేపథ్యంలో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది..
ఆమెరికాలో పర్యటిస్తున్న మోదీ, జో బైడెన్ తో భేటీ నేపథ్యంలో మీడియా, జర్నలిస్టు దాడిని చర్చించాలని అమెరికా అధ్యక్షుడిని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇనిస్టిట్యూట్ కోరింది. భారత్ లో మోదీ సర్కారు మీడియాకు సంకెళ్లు వేస్తున్నదని, ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది కొలుస్తారు..
భారత్లో తరచూ జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని, తమను వ్యతిరేకిస్తున్న వారిపై మోదీ సర్కారు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని ఐపీఐ అమెరికన్ డెస్క్ పేర్కొంది. దీనిపై మోదీని ప్రశ్నించాలని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కోరింది. మీడియా వ్యవస్థ ప్రమాదస్థితిలో పడేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో దీనిపై చర్చించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.
భారత్ లో కూడా మోదీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా స్వేచ్ఛను కాలరాసేలా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వివిధ జర్నలిస్ట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వీరికి మద్దతుగా ఐపీఐ స్పందించడం.. ఏకంగా ఆమెరికా అధ్యక్షుడిని స్పందించాలని కోరడం సంచలనం రేపింది. బీబీసీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని అంతర్జాతీయ జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక పత్రికా రంగాన్ని మోదీ సర్కారు తీవ్రంగా వేధిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. సుంకాన్ని పెంచి, కక్ష సాధింపునకు దిగిందని మండిపడుతున్నాయి. అయితే ఇదంతా కొనసాగుతున్నా అమెరికా మీడియా మాత్రం మోదీ పర్యటనను హైలెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
ReplyForward
|