Revanth Reddy in KCR Sabha : తెలంగాణలో ఎన్నికల కోలాహలం పెరిగింది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. వరుస సభలతో హోరెత్తిస్తున్నాయి. ఎక్కడ చూసినా పాటలే వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో మైకులు అదరగొడుతున్నాయి. పాటలతో ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పార్టీల ప్రచారమే కనిపిస్తోంది. మైకులతో వాహనాలు తిరుగుతున్నాయి.
ఇక్కడ కేసీఆర్ సభలో రేవంత్ రెడ్డి పాట వినిపించడంతో కేసీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. అక్కడొగడు అక్కడొగడు ఇలాంటి వారుంటరు. మన సభలో వారి పాట ఏందయ్యా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైక్ బంద్ చేయాలని చెప్పడంతో ఆఫ్ చేస్తారు. ఇలా రాష్ట్రంలో మైకుల జోరు కొనసాగుతోంది. ఇలా మన మీటింగులో వేరే వారి పాట వినిపిస్తే కోపం రావడం సహజమే.
తెలంగాణలో ఏ మూలకు పోయినా కాంగ్రెస్ పాటలే వినిపిస్తున్నాయి. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంటోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ పాటలే ప్రధానంగా పని చేస్తాయని నమ్ముతోంది. ఇందులో భాగంగానే పాటల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోతోంది. దీంతోనే కాంగ్రెస్ పాటలు బాగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మైకులు బాగా పనిచేస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రచారం పీక్ స్థాయికి చేరింది. సర్వేలన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. దీంతో గులాబీ బాస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశమై గెలుపు కోసం కావాల్సిన సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రజలకు చేరువ కావడంతో కేసీఆర్ ఏం చేసినా ప్రయోజనం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.