Revanth Reddy Kicked Activists : తెలంగాణలో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలుపెరగని రీతిలో ప్రచార హోరు కొనసాగిస్తున్నాయి. కార్యకర్తలతో కలిసి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈనేపథ్యంలో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకు రెండు మూడు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. పార్టీ నేతలు ఘనంగా నామినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. నేతల్లో జోష్ పెరుగుతోంది. ఆదరణ కూడా వస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ముందుకు వెళుతున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పలు పథకాలు ప్రవేశపెట్టింది. ఆరు పథకాలతో ఓటర్లను దగ్గర చేసుకోవడానికి సమాయత్తం అవుతోంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి మండలంలో పర్యటిస్తున్నారు. అక్కడ జనసందోహం పెరిగింది. దీంతో రేవంత్ రెడ్డిని వాహనం నుంచి కిందికి దిగనీయలేదు. దీంతో వారిని కిందికి తోసే క్రమంలో కాలితో తన్నే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కార్యకర్తలను దేవుళ్లలాగా చూసుకోవాల్సిన నేతనే కాళ్లతో తన్నడం చర్చనీయాంశం అయింది.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతిబంధకంగా మారనుందా? రేవంత్ రెడ్డి తీరు వివాదాలకు కేంద్రంగా అవుతుందా? ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తారు. పార్టీకి ఇది చేటు తెచ్చే చర్యగా అభివర్ణిస్తున్నారు. పాలకుర్తి ఘటన ప్రజల్లో ఎలాంటి మలుపుకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
పాలకుర్తి సభలో కార్యకర్తలు ఎగబడడంతో కాలుతో తన్నిన రేవంత్ రెడ్డి pic.twitter.com/8nZZixE2KQ
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2023