29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Revanth Reddy : జోస్యం చెబుతున్న రేవంత్.. సీట్ల లెక్క తేల్చేశాడుగా..!

    Date:

    Revanth Reddy
    Revanth Reddy

    Revanth Reddy : తెలంగాణలో మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ గెలిచేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.  అయితే ఈ సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చి చెప్పారు.

     రాష్ట్రంలో ఆయా పార్టీలకు వచ్చే సీట్లపై ఇటీవల తన సర్వే వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు.. అధికార బీఆర్ఎస్ 45 – కాంగ్రెస్ 45, బీజేపీ 7, ఎంఐఎం 7 సీట్లలో గెలుస్తాయన్నారు. చాలా స్థానాల్లో గట్టిపోటీ ఉందని ఆయన జోస్యం చెప్పారు. ఓట్ల శాతం చూస్తే BRS 37%, కాంగ్రెస్ 34%,‌బీజేపీ 14% ఓట్లు వస్తాయని ప్రకటించారు. అయితే బీజేపీ ఓట్ల శాతం 24 నుంచి 14కు పడిపోతుందని చెప్పారు.
    అయితే రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందనేది ముందు నుంచి ఊహించిందే. హంగ్ వస్తుందని ప్రచారం నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్వే దానికి మరింత బలం చేకూర్చింది. మరోవైపు విజయానికి దగ్గరగా ఉన్నామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్  శ్రేణులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. తద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులకు గట్టి సవాల్ విసిరారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం పుంజుకుంది. సీనియర్ల తో పాటు క్యాడర్ ఇక కొద్దిగా కష్టపడితే కాంగ్రెస్ దే విజయమని ఆయన హింట్ ఇచ్చారు. పదేండ్లు ప్రతిపక్షం లో ఉన్న పార్టీ కి ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి కాబట్టి రేవంత్ తన వ్యూహంలో భాగంగానే ఈ సర్వే వివరాలు బయటకు వెల్లడించారని అంతా అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి రేవంత్ రెడ్డి క్లాస్!

    Revanth Reddy : రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ సొంత నిర్ణయాలు తీసుకోవడం...

    Telangana : హెచ్‌సీయూ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Telangana Deputy CM : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

    Revanth Reddy : 16 రోజుల జైలు జీవితం నరకం చూపించింది: రేవంత్ రెడ్డి ఆవేదన

    Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తాను...