Telangana : నిధులు, నియామకాలు, నీళ్లు ప్రాతి పదికన ఏర్ప డిన తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా ఉద్యోగా లు రాక నిరుత్సాహంగా ఉన్న యువతకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనతో పాటు ఉద్యోగాల భర్తీ కోసం పలు చర్యలు ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేం దుకు వయోపరిమితి మించి పోయిందని బాధప డుతున్న వారికి ఊరట లభించనుంది.
తెలంగాణలో పదేళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న పలు నోటిఫికేషన్లను విడుదల చేసేం దుకు సిద్దమవుతున్న ప్రభుత్వం అంతకంటే ముందు వారు దరఖాస్తు చేసుకునే ఉద్యోగాల వయో పరిమితి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గరిష్ట వయో పరిమితిని రెండేళ్లు పెంచింది. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగానే జీవో జారీ చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించనుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకేజీలు, టీఎస్పీఎస్సీ అక్రమాల కారణంగా నిరుద్యోగులు తమ విలువైన వయస్సును నష్టపోయారు. దీంతో పలు చోట్ల నిరుద్యోగులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వయో పరిమితి పెంచాలనే డిమాండ్లు వచ్చాయి. వీటిని పరిశీ లించిన ప్రభుత్వం వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో త్వరలో 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అలాగే 15 వేల పోలీసు ఉద్యోగాలను కూడా త్వరలో భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.