
Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి ప్రమాదాల నుంచి పౌరులను కాపాడేందుకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఎవరైనా మోసపోయినా లేదా మీకు అనుమానాస్పదంగా అనిపించే బెట్టింగ్ యాప్‌లు కనిపిస్తే, వాటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఇకపై బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులైనా 8712672222 అనే నెంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ నెంబర్ ద్వారా పౌరులు బెట్టింగ్ యాప్‌ల మోసాలపై నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం లభిస్తుంది. తద్వారా ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకునే వీలుంటుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని, మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. అనుమానాస్పదంగా ఉన్న ఏ బెట్టింగ్ యాప్‌ను చూసినా వెంటనే ఈ నెంబర్‌కు సమాచారం అందించాలని కోరుతోంది.