Sharmila counter attack : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వైఎస్సార్ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘రాష్ట్రం సాధించుకున్నది తెలంగాణ వాళ్లు పాలించుకునేందుకు’అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ అటాక్ ఇచ్చింది. తనది ఆంధ్ర ప్రదేశం అయితే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీది ఎక్కడ..? అంటూ శర్మిల రేవంత్ ను ప్రశ్నించారు. తెలంగాణాలో రాజకీయాలు చేయద్దని చెప్పే అర్హత ఆయనకు ఏమి ఉందని..? ఇక్కడ ఉన్న ఏకైనా ప్రాంతీయ పార్టీ వైఎస్సార్టీపీ మాత్రమే అన్నారు. ఈ గడ్డపై జై తెలంగాణ అనే దమ్ము తనకే ఉందని.. రేవంత్ అభద్రతా భావంతో ఇలా మాట్లాడుతున్నారన్నారు.
జై తెలంగాణ అనే పదం రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు, మోడీకి, సోనియాకు అనే హక్కు లేదు. ‘రేవంత్ అల్లుడు ఆంధ్రా ప్రాంతానికి చెందినవారట. ఫస్ట్ ఆ సంగతి చూసుకో అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నాకు చీర, సారె పెడతాడట. కానీ ఇక్కడ రాజకీయాలు చేయోద్దట. మరి సోనియా గాంధీది ఇటలీ కాదా..? ఈ లెక్కన సోనియాకు కూడా చీర, సారె పెడతాం. ఇండియాలో రాజకీయాలు చేయోద్దననే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా..? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ వైఎస్సార్టీపీ అని, ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎప్పుడూ ముందే ఉంటుందన్నారు. పెళ్లి చేసుకునే మహిళ తన సొంత వాళ్లను కాదనుకొని తెలియని వ్యక్తితో వెళ్తుందని, మరో కుటుంబాన్ని తన కుటుంబంగా స్వీకరిస్తుందని చెప్పారు. ఇది దేశ సంస్కృతి. ఇంత గొప్ప సంస్కృతిని అర్ధం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలి, కానీ రేవంత్ నీకు అదిలేదు అంటూ ‘షర్మిల’ ఫైర్ అయ్యారు.
మరో ఐదు నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండడతో వైఎస్సార్టీపీ అక్ష్యక్షురాలు దూకుడు పెంచుతూ కనిపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3800 కిలోమీటర్లకు పైగా ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేశారు. ఇక ఆ తరువాత నుంచి కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇటీవల TSPSC పేపర్ లీక్ పై కూడా షర్మిల (Ys Sharmila) తన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని కేసీఆర్ కు వ్యతిరేకంగా యుద్ధం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..ప్రజల సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీలపై షర్మిల తన గళాన్ని వినిపిస్తున్నారు.రేవంత్ మీ మేడంది ఎక్కడ..? నీ అల్లుడి గురించి చెప్పు.. షర్మిల కౌంటర్..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వైఎస్సార్ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘రాష్ట్రం సాధించుకున్నది తెలంగాణ వాళ్లు పాలించుకునేందుకు’అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ అటాక్ ఇచ్చింది. తనది ఆంధ్ర ప్రదేశం అయితే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీది ఎక్కడ..? అంటూ శర్మిల రేవంత్ ను ప్రశ్నించారు. తెలంగాణాలో రాజకీయాలు చేయద్దని చెప్పే అర్హత ఆయనకు ఏమి ఉందని..? ఇక్కడ ఉన్న ఏకైనా ప్రాంతీయ పార్టీ వైఎస్సార్టీపీ మాత్రమే అన్నారు. ఈ గడ్డపై జై తెలంగాణ అనే దమ్ము తనకే ఉందని.. రేవంత్ అభద్రతా భావంతో ఇలా మాట్లాడుతున్నారన్నారు.
జై తెలంగాణ అనే పదం రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు, మోడీకి, సోనియాకు అనే హక్కు లేదు. ‘రేవంత్ అల్లుడు ఆంధ్రా ప్రాంతానికి చెందినవారట. ఫస్ట్ ఆ సంగతి చూసుకో అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నాకు చీర, సారె పెడతాడట. కానీ ఇక్కడ రాజకీయాలు చేయోద్దట. మరి సోనియా గాంధీది ఇటలీ కాదా..? ఈ లెక్కన సోనియాకు కూడా చీర, సారె పెడతాం. ఇండియాలో రాజకీయాలు చేయోద్దననే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా..? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ వైఎస్సార్టీపీ అని, ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎప్పుడూ ముందే ఉంటుందన్నారు. పెళ్లి చేసుకునే మహిళ తన సొంత వాళ్లను కాదనుకొని తెలియని వ్యక్తితో వెళ్తుందని, మరో కుటుంబాన్ని తన కుటుంబంగా స్వీకరిస్తుందని చెప్పారు. ఇది దేశ సంస్కృతి. ఇంత గొప్ప సంస్కృతిని అర్ధం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలి, కానీ రేవంత్ నీకు అదిలేదు అంటూ ‘షర్మిల’ ఫైర్ అయ్యారు.
మరో ఐదు నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండడతో వైఎస్సార్టీపీ అక్ష్యక్షురాలు దూకుడు పెంచుతూ కనిపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3800 కిలోమీటర్లకు పైగా ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేశారు. ఆ తరువాత నుంచి కూడా నిత్యం ప్రజలతోనే గడుపుతున్నారు. ఇటీవల TSPSC పేపర్ లీక్ పై కూడా షర్మిల తన గళాన్ని వినిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..ప్రజల సమస్యలపై గొంతెత్తుతున్నారు.