
RGV Vyuham : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు మాత్రమే చక్రం తిప్పుతున్నారు. ఒకరు సీఎం, మరో ఇద్దరు చంద్రబాబు, పవన్ కళ్యాన్. వీరి చుట్టూ ఆ రాష్ట్ర రాజకీయాలు, డెవలప్‌మెంట్, కామెంట్లు కొనసాగుతున్నాయి. విజన్ ఉన్న నేతగా చంద్రబాబును గద్దెనెక్కించిన ఓటర్లు, ఐదేళ్లకే దింపేశారు. ఆ తర్వాత జగన్ కు పాలనా పగ్గాలు అప్పజెప్పారు. చంద్రబాబు అంత కాకపోయినా జగన్ పాలన కొంత వరుకు బాగానే ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే జగన్ తెచ్చిన పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించకపోవడంతో అవికాస్తా బాబుకు ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే. జనసేన పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని భావించి పొత్తు పెట్టుకుంటామని, పొత్తుతూనే 2024 ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశాడు. పవన్ పొత్తు విషయంలో ఎవ్వరు ఏమన్నా ‘రాంగోపాల్ వర్మ’ మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు పొడిచిన దానికంటే పెద్ద వెన్నుపోటు జనసేన కార్యకర్తలను పవన్ పొడిచారని ట్విట్ చేశాడు.
పవన్ పై అంతలా విరుచుకుపడిన రామ్ గోపాల్ వర్మ ఆయనను ఎన్నికల్లో హీరో చేసేందుకు ఒక సినిమా చేశాడు. ఆ సినిమానే ‘వ్యూహం’ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు జనసేన చుట్టూ తిరుగుతున్నాయి. ‘వారాహి యాత్ర’కు జనాల నుంచి మంచి స్పందన వస్తుంది. ఏ ఇద్దరు ఒకచోట చేరినా యాత్ర గురించే మాట్లాడుకోవడం విశేషం. వైసీపీ నాయకులు కూడా టీడీపీ కంటే జనసేనే ఇప్పుడు టార్గెట్ అనుకుంటున్నారు.
సీఎం జగన్ రాంగోపాల్ వర్మతో కలిసి పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకంగా ఒక సినిమా చేయించాడు. దీనికి సంబంధించిన టీజర్ కొద్ది సేపటి క్రితమే (జూన్ 24) రిలీజ్ అయ్యింది. ఇందులో జగన్ ను మహాత్ముడిగా చూపించిన రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడిని పక్కా విలన్ గా చూపించాడు. బాబులోని నెగెటివ్ షేడ్స్ చూపిస్తూ.. టీడీపీపై నెగెటివిటీని గుప్పించాడు వర్మ. పవన్ కళ్యాణ్ ను మాత్రం ఇప్పటి వరకైతే చూపించలేదు.
ఈ మూవీ అధికంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు పెళ్లిళ్లు.. ఇండస్ట్రీలో ఎంతో మందిని బయటకు పంపడం, ఇలాంటి వాటిని ప్రధాన అంశాలుగా ఈ చిత్రంలో చూపించారట. జగన్ కు సపోర్ట్, చంద్రబాబుకు వ్యతిరేకం అయినా పవన్ కళ్యాణ్ ను ప్రముఖంగా టార్గెట్ చేయడమే వర్మ ప్రధాన లక్ష్యమని చిత్ర వర్గాల్లో టాక్ ఉంది. ఇక త్వరలో రెండో టీజర్ కూడా రిలీజ్ చేస్తారట. అందులో పవన్ ఎంట్రీ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఆ టీజర్ పూర్తి నిడివి పవన్ కళ్యాణ్, జగన్ మాత్రమేు ఉంటారట.