
Rohini Karte : రేపు రోహిణి కార్తె ప్రవేశించనుంది. రోహిణిలో ఎండలు రోకళ్లు పగిలేలా కొడుతాయని చెబుతుంటారు. ఎండాకాలం చివరి రోజులు ఈ పదిహేను రోజులే. దీంతో ఎండలు విపరీతంగా ఉంటాయి. వానలు పడితే మాత్రం వ్యవసాయ పనులు షురు అవుతాయి. ఈ కాలంలో ఎండల బారి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చల్లదనం కోసం అప్రమత్తంగా ఉండాలి.
రోహిణి కార్తె రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అందుకే దుస్తుల విషయంలో పొరపాట్లు చేయకూడదు. ముదురు రంగు దుస్తులు అసలు ధరించకూడదు. తెల్లనివి వేసుకుంటే మంచిది. దీంతో ఎండ బారి నుంచి రక్షించుకోవచ్చు. రోహిణి కార్తె మే 25 నుంచి జూన్ 8 వరకు ఉంటుంది.
మనం తినే ఆహారాల విషయంలో కూడా ఏమరుపాటుగా ఉండకూడదు. కొబ్బరి బొండాలు, మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు, రాగి జావ వంటివి తీసుకుంటే ఇబ్బంది ఉండదు. పచ్చళ్లు, వేపుళ్లు, కారం, ఉప్పు వేసిన పదార్థాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
ఫ్రిజ్ వాటర్ తాగకూడదు. మట్టి కుండలో నీళ్లు తాగడమే మంచిది. లేకపోతే దాహం తీరదు. ఫ్రిజ్ వాటర్ తో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా రోహిణి కార్తె సమయంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఎండలో తిరగడం మంచిది కాదు.