
Rohini surgery : రోహిణీ.. ఈమె పేరు అందరికి రిజిస్టర్ అయ్యింది.. అంతగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో, కామెడీ టైమింగ్ తో అలరిస్తుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో లేడీ కమెడియన్స్ లేరనే చెప్పాలి. ఉన్నప్పటికీ అంతగా రాణించడం లేదు.. కానీ రోహిణీ ఆ లోటు తీర్చుతుంది అని అంతా అనుకుంటున్నారు.
ఈమె సీరియల్స్ లో బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సీరియల్ తోనే మెప్పించిన రోహిణీ ఆ తర్వాత కామెడీ షోలలో కనిపిస్తుంది.. సీరియల్స్ తర్వాత ఈమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమె మరింతగా ప్రేక్షకులకు చేరువ అయ్యింది.. తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తుంది..
ఈమె స్లాంగ్, నటన, కామెడీ అన్ని కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టు కుంటాయి.. ప్రస్తుతం బుల్లితెర మీద పలు ఎంటర్టైనింగ్ షోలు చేస్తూనే వెండితెర మీద కూడా అవకాశాలు అందుకుంటుంది. రెండు వైపులా బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఆసుపత్రి బెడ్ మీద కనిపించి ఆమె ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది..
విజయవాడ లోని ఒక ఆసుపత్రిలో ఈమె కాలు సర్జరీ చేయించుకుంది.. దాదాపు 10 గంటల పాటు శ్రమించి ఈమె కాలులో ఉన్న రాడ్ ను తొలగించారు.. ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్ లో రాడ్ వేయగా ఇప్పుడు దానిని తీసినట్టు ఈమె తెలిపింది. ఇప్పుడు బాగానే ఉన్నానని ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పారని.. ఆరోగ్యం పూర్తిగా నయం అయ్యాక సెట్స్ లోకి అడుగు పెడతానని ఈమె చెప్పుకొచ్చింది..