Rohit Sharma టీం ఇండియాలో ప్రతిభకు కొదువలేదు.టాలెంట్ ఉన్న అటగాళ్ళు భారత్ తరపున ఆడడానికి పోటీ పడుతూనే ఉన్నారు. సీనియర్ క్రికెటర్లు యువ ఆటగాళ్ళను తమ జట్టులోకి రావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని కలిపిస్తూ ఉంటారు. టీంలోకి కొత్తగా వచ్చిన వారికి ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అలాగే సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ కూడా తమ జట్టులోకి కొత్తగా వచ్చిన వారి ఆటను మెరుగుపరిచేందుకు తమ బ్యాటింగ్ ఆర్డర్ ను సైతం త్యాగం చేస్తున్నారు.
వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భారత్ విజయం సాధించింది. ఆ సిరీస్ లోని ఫస్ట్ వన్డే లో ఇండియా టీం లో ప్రయోగాలు చేశారు.ఇందులో యువ ఆటగాళ్లకు అవకాశం కలిపించాలనే ఉద్దేశ్యంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తన స్థానాలను వారికిచ్చేశారు.
తొలి వన్డే మ్యాచ్ లో బార్బడోస్ లో జరిగింది. ఇందులో టాస్ నెగ్గిన ఇండియా మొదటగా బౌలింగ్ ను ఎంచుకున్నది. భారత్ బౌలర్లు విండీస్ ను తక్కువ పరుగులు చేసేలా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక తర్వాత బ్యాటింగ్ చేయబోయే ఇండియా లో బ్యాటింగ్ వరుస క్రమంను పూర్తిగా మార్చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ తన ప్రతిభను చూపాడు. ఇక ముకేశ్ కుమార్ బౌలింగ్ లో రెండు వైపులా చేసిన స్వింగ్ తో అందరినీ ఆశ్ఛర్యపరిచాడు. దీని వల్ల కొత్తగా ఆడుతున్న ప్లేయర్స్ కు ఛాన్స్ ఇచ్చి వారిని ఎంకరేజ్ చేసినట్లు అయిందని రోహిత్ తెలిపాడు. టీం ఇండియా వీలు కుదిరినప్పుడల్లా జట్టు ప్లేయర్స్ అందరికీ కావాల్సిన అవకాశాలు కలిపిస్తుంది. దీంతో జూనియర్స్ లో ఆటలో మెలకువలను, శక్తి సామర్థ్యాలను పెంపొందించే పనిలో భారత్ జట్టు ఉందని, మొదట్లో తమ సీనియర్గు కూడా తమకు చాలానే సహకరించారని తన కెరీర్ ప్రారంభ రోజులు గుర్తు వస్తున్నాయని రోహిత్ చెప్పారు.