
Rohit Sharma Won the Hearts of Fans : ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో ఇండియా 2-1 తేడాతో కప్ సొంతం చేసుకుంది. దీంతో చివరి వన్డేలో భారత జట్టు ఓటమి పాలైనా ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. కప్ తీసుకునే సందర్భంలో కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప మనసు చాటుకుని ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు సారధ్యం వహించాడు.
జట్టు విజయాలు నమోదు చేయడంతో కప్ తీసుకునే అవకాశం రాహుల్ కే ఇచ్చారు. దీంతో రోహిత్ పెద్ద మనసుకు అందరు ఫిదా అవుతున్నారు. కెప్టెన్ గా కాకుండానే మంచి మనసున్న వాడిగా కూడా రోహిత్ కు గుర్తింపు దక్కించుకున్నాడు. మూడో వన్డేలో ప్రజెంటేషన్ వేడుకలో విన్నింగ్ ట్రోఫీ అందుకోవాలని రోహిత్ సూచించడంతో రాహుల్ కప్ తీసుకున్నాడు.
రోహిత్ శర్మ అందుకోవాల్సి ఉన్నా ట్రోఫీని రాహుల్ ను తీసుకోమని చెప్పడంతో ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. రోహిత్ పెద్ద మనసుకు సంతోషించారు. తనకు దక్కాల్సిన గౌరవాన్ని ఇతరులకు పంచడం ఎంత మందికి సాధ్యమవుతుంది.
దీంతో రోహిత్ శర్మ తీరును మెచ్చుకుంటున్నారు. రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించగా వాటికి రాహుల్ సారధ్యం వహించడంతో అలా చేశాడని అనుకుంటున్నారు. కానీ కెప్టెన్ ఎవరైనా కప్ వారే తీసుకోవడం సహజమే. కానీ ఇక్కడ రోహిత్ శర్మ గొప్ప మనసుకు ప్రేక్షకులతో పాటు అందరు ఫిదా అవుతున్నారు. ట్రోఫీతో ఫొటో దిగే సమయంలో రోహితో ఓ ఆటగాడిగా కనిపించాడు.
Captain @ImRo45 & @klrahul collect the @IDFCFIRSTBank Trophy as #TeamIndia win the ODI series 2⃣-1⃣ 👏👏#INDvAUS pic.twitter.com/k3JiTMiVGJ
— BCCI (@BCCI) September 27, 2023