Rashmika Mandanna : రష్మిక మందన.. ఈ పేరు వింటే రౌడీ బాయ్ ఫ్యాన్స్ కూడా పులకించిపోతారు. ఆమెకు విజయ్ ఫ్యాన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. గీత గోవిందం సమయంలో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ కుదిరిందట. అందుకే ఆ సినిమా వసూళ్ల వర్షం కురిపించిందట. అప్పటి నుంచి విజయ్ ఫాన్స్ కు రష్మిక అంటే ఇష్టం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ రష్మికను వదిన అని పిలవడం కూడా మొదలు పెట్టారు. ఈ వార్తలను విజయ్, రష్మిక కూడా ఎప్పుడూ ఖండించలేదు. అలా అని ఒప్పుకున్నట్లు కూడా చెప్పలేదు. రష్మిక, విజయ్ చేసే పనులు, వెళ్లే ప్రదేశాలు, చెప్పే సమాధానాలు, మాట్లాడే తీరు చూస్తుంటే మాత్రం అనుబంధం నిజమే అని అనిపిస్తుంది.
తాజాగా ‘గంగం గణేషా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మిక అతిథిగా వీచ్చేసింది. ఈ ఫంక్షన్ లో.. రష్మిక – ఆనంద్ దేవరకొండ మధ్య చిట్ చాట్ జరిగింది. ఆనంద్ అడిగిన ప్రశ్నలకు రష్మిక ఇచ్చిన సమాధానాలు ఆసక్తిని కలిగించాయి. ఈ మాటలను విజయ్ ఫ్యాన్స్ ఢీకోడ్ చేయడం మొదలెట్టారు.
ఫెవరేట్ కో స్టార్ ఎవరని అడిగే రష్మిక ఏం ఆలోచించకుండా విజయ్ పేరు చెప్పింది. ఫేవరెట్.. డెస్టినేషన్ ‘వియాత్నాం’ అంది. (విజయ్, రష్మిక తొలిసారి కలిసి వెళ్లిన ఫారెన్ ట్రిప్ వియాత్నాం. అందుకే రష్మిక ఆ పేరు చెప్పిందని ఫ్యాన్స్ ఢీకోడ్ చేశారు.) ఈ చిట్ చాట్ లో ‘నువ్వు నా ఫ్యామిలీరా’ అని ఆనంద్ ని ఉద్దేశించి రష్మిక అంది. దీంతో రౌడీ కుటుంబంలోకి రష్మిక అడుగుపెట్టబోతోందన్న సంకేతాలు అందాయని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఈ వేడుకలో రష్మిక, ఆనంద్ బాండింగ్ ఆకట్టుకుంది. ఫ్యాన్స్ కూడా రష్మికను ‘వదిన..’ అంటూ సంబోధించడం గీత గోవిందం నుంచే మొదలెట్టేశారు. ఇవన్నీ చూస్తుంటే ఈ బంధం ముదిరి పాకాన పడేట్లు కనిపిస్తోంది. ఆ ఒక్క తీపి కబురు ఎప్పుడు అందిస్తారో..! చూడాలి మరి.