
Scott Dora : టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా దగ్గర ”ఆర్ఆర్ఆర్” సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు.. అగ్ర డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు జాతికి గర్వకారణం అయ్యింది.. మరి అలాంటి ఎపిక్ సినిమాలో నటించిన స్టార్ నటుడు తాజాగా మరణించినట్టు తెలుస్తుంది..
ఈయన మరణించడంతో ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటు చేసుకుంది.. నిన్న సీనియర్ నటుడు శరత్ బాబు మరణించగా విషాద ఛాయలు అలుము కున్నాయి.. అది మరవక ముందే ఆర్ఆర్ఆర్ స్టార్ మరణించడంతో సినీ పరిశ్రమలో దిగ్బ్రాంతి చోటు చేసుకుంది.. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు అకాల మరణ వార్త అందరిని కలిచి వేస్తుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో స్కాట్ దొర పాత్రలో విలన్ గా నటించిన రే స్టీవెన్ సన్ (58) నిన్న ఆదివారం ఇటలీలో మరణించినట్టు హాలీవుడ్ మీడియా కన్ఫర్మ్ చేసింది. అయితే ఈయన ఎలా మరణించారు అనే విషయంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు.. ఈయన మరణ వార్త తెలిసి ఆర్ఆర్ఆర్ బృందం సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈయన అభిమానులు, స్నేహితులు ఈ విషయం తెలుసుకుని షాక్ కు గురి అయ్యారు.. ఇప్పటి వరకు ఆయనతో కలిసి పని చేసిన ఆర్టిస్టులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈయన మృతిపై రాజమౌలి సైతం ట్వీట్ చేసారు..
ఈ వార్తను నమ్మలేక పోతున్నాను.. షాక్ అయ్యాను.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో తనతో పాటు ఉన్న వారికీ సైతం మంచి ఉత్సాహం, ఎనర్జీ తీసుకొచ్చేవారు.. ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని కలిగించేది.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. అంటూ ట్వీట్ చేసారు. హాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మెప్పించారు.. విలన్ గా కూడా మన తెలుగు సినిమాలో ఆకట్టుకున్న ఈయన మరో రెండు రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ లోపే ఈయన మరణించడం ఆయన ఫ్యాన్స్ కు మరింత దుఃఖాన్ని కలిగిస్తుంది.