
producer Danayya son : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుని కొన్నాళ్లపాటు సంసారం చేసి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటుందని రకరకాల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. కొందరేమో చైతన్య హీరోయిన్ ధూళిపాళ శోభితతో ప్రేమాయణం సాగిస్తున్నాడని చెబుతున్నారు. మరికొందరేమో సమంత ప్రముఖ ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత దానయ్య కుమారుడిని పెళ్లి చేసుకోబోతోందని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే దానయ్య కొడుకుతో సమంత ప్రేమ వ్యవహారం నడుపుతోందని చెబుతున్నారు. అధికారికంగా వీరి వివాహం నిశ్చయమైందని కూడా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వీరి వివాహం త్వరలో జరుగుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతేడాది రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి దర్శకత్వంలో నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దానయ్య పేరు మారుమోగిపోయింది.
దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అధీరా అనే సినిమా చేస్తున్నాడు. దీంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. సమంతతో వివాహం కూడా చేసుకోబోతున్నాడనే వార్త ప్రస్తుతం హల్ చల్ అవుతోంది. ఏది ఏమైనా వీరి వివాహం జరుగుతుందో లేదో కానీ ప్రచారం మాత్రం ఊపందుకుంది.
ఇలా సమంతపై రకరకాల పుకార్లు రావడం సహజమే. ఆ మధ్యన ఏదో వ్యాధి వచ్చిందని అన్నారు. దీంతో ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందని చెబుతున్నారు. ప్రముఖ హీరోయిన్లపై సహజంగా పుకార్లు వస్తుంటాయి. ప్రస్తుతం సమంత ఖాళీగానే ఉండటంతో ఆమె గురించి కూడా రకరకాల పద్ధతుల్లో వదంతులు రావడం కామనే.