
RRR targets YCP : వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలకి డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణం రాజు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు ఎవరైనా 60 రోజుల పాటు సెలవు అడగకుండా సభకు రాకుంటే అనర్హత పడుతుందని తెలిపారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చి.. తన అభిప్రాయాలను చెప్పాలని డిప్యూటీ స్పీకర్ కోరారు. ఇదే జరిగితే రానున్న రోజుల్లో వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రఘురామకృష్ణం రాజు తన పాత పగలను గుర్తు చేసుకుంటూ వైసీపీపై యుద్ధం ప్రకటించారు. వైసీపీ నేతలపై తన విమర్శలను కొనసాగిస్తూ, పార్టీ విధానాలను ప్రశ్నించారు. తనపై జరిగిన అరెస్టు, అనుభవాలను ప్రస్తావిస్తూ, తన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు.
రఘురామకృష్ణం రాజు తన రాజకీయ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొని, తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తూ, వైసీపీని ఇరుకునపెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.
రఘు రామ రాజు ముందుకు జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై విమర్శలు చేశారు. అసెంబ్లీకి వరుసగా 60 రోజుల పాటు హాజరు కాకపోతే, అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం, ఒక ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించడానికి నిర్దిష్ట కారణాలు ఉండాలి, ఉదాహరణకు లాభదాయకమైన హోదాలో ఉండటం, మానసిక స్థితి సరిగా లేకపోవడం, దివాళా తీసినట్లు కోర్టు ప్రకటించడం, లేదా ఇతర దేశ పౌరసత్వం పొందడం. అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం అనర్హతకు కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.
అయితే, పార్లమెంట్ సభ్యుల విషయంలో, ఎలాంటి అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే, అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అయితే, ఈ నియమం రాష్ట్ర అసెంబ్లీలకు వర్తించదని నిపుణులు సూచిస్తున్నారు.
కాబట్టి, వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం అనర్హతకు కారణం కాకపోవచ్చు. అయితే, ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం కీలకం అవుతుంది. రఘురామరాజు మాత్రం తన ముందుకు జగన్ ను రప్పించేందుకు పెద్ద ప్లానింగ్ లే చేస్తున్నారు.






