
70 crores Bonus : చైనాలోని ప్రముఖ సంస్థ హెనన్ మైన్ క్రేన్ తన ఉద్యోగులకు ఇచ్చిన బోనస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. కంపెనీ వారు ఏకంగా రూ.70 కోట్లు క్యాష్ రూపంలో ఒక భారీ టేబుల్ పై వేసి, ఉద్యోగులకు సెన్సేషనల్ ఆఫర్ ఇచ్చారు.
– ఆఫర్ డీటైల్స్:
– 30 టీమ్స్ గా ఉద్యోగులను విభజించారు.
– ఒక్కో టీమ్ నుండి రెండుగురు సభ్యులు మాత్రమే వచ్చి డబ్బు లెక్కపెట్టాలి.
– 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో, అంత మొత్తాన్ని తీసుకెళ్లొచ్చు!
ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చారు. కొందరు వేగంగా నోట్ల కట్టలు లెక్కపెడుతూ కనిపిస్తే, మరికొందరు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
-ఇప్పటికే ట్రెడిషన్ అవుతున్న బోనస్!
ఇది కొత్తది కాదు! 2023 జనవరిలోనూ హెనన్ మైన్ క్రేన్ సంస్థ ఇదే విధంగా రూ.70 కోట్ల బోనస్ ఇచ్చింది. ఈ కంపెనీ ఉద్యోగులకు ఇచ్చే బోనస్ ఇప్పుడిక వార్షిక సంబరంలా మారిపోయింది.