marriages : మనదేశంలో ప్రతియేటా లక్షలాది పెళ్లిళ్లు జరుగుతుంటాయి. పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది లక్షల్లో బిజినెస్ జరుగుతుంటుంది. మ్యారేజ్ బ్యూరో, పురోహితులు, వెడ్డింగ్ మాల్స్, సారీ సెంటర్స్, గోల్డ్ షాపులు, క్యాటరింగ్, ఫంక్షన్ హాల్, పూల వ్యాపారం, బ్యూటీ పార్లర్ తదితర రంగాల వారికి చేతినిండా పని దొరకుతుంది.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. బంధు మిత్రులను పిలిచి ఘనంగా కొత్త జంటలు పెళ్లి చేసుకుంటాయి. అయితే కొందరు మాత్రం పెళ్లిని చెడగొట్టడాన్ని సైతం బిజినెస్ గా మార్చుకొని లక్షల్లో సంపాదిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ బిజినెస్ మనదేశంలో ఇంకా స్టార్ కాలేదు.
కానీ స్పెయిన్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా సాగుతోందట. స్పెయిన్ లో పెళ్లిళ్లు చెడగొట్టే వారికి అసలు ఖాళీ అనేది లేదని తెలుస్తోంది. దీంతో స్పెయిన్ లో పెళ్లిళ్లపై యువతలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఏదిఏమైనా పెళ్లిళ్ళు చెడగొట్టి డబ్బులు సంపాదించుకోవడం మంచిది కాదని నెటిజన్లు సూచిస్తున్నారు.