Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఫ్యామిలీతో కలిసి కశ్మీర్ పర్యటనలో బిజీబిజీగా గడుపు తు న్నాడు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
టీమిండియా లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తన కుటుంబంతో కలిసి కశ్మీర్ (Kashmir)లో పర్యటిస్తున్నాడు. ఈ సంద ర్భంగా గుల్‌మార్గ్‌లో స్థానికులతో కలిసి క్రికెట్ ఆ డుతూ కనిపించాడు. చుట్టూ లోయల మధ్య రో డ్డుపై స్థానికులతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఒక ఓవర్ బ్యాటింగ్ చేశాడు. తనను ఔట్ చేయాలని వారికి సచిన్ సవాల్ విసిరాడు.
అయితే మాస్టర్ బ్లాస్టర్ వికెట్ తీయడంలో వారు విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ను సచిన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తు తం ఈ వీడియో క్రికెట్ ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది.