Home EXCLUSIVE Sai Pallavi Marriage : నల్ల వ్యక్తితో వివాహమా.. సాయి పల్లవి పెళ్లి ఫొటో వెనుక...

Sai Pallavi Marriage : నల్ల వ్యక్తితో వివాహమా.. సాయి పల్లవి పెళ్లి ఫొటో వెనుక కథ.. వైరల్

216
Sai Pallavi Marriage
Sai Pallavi Marriage

Sai Pallavi Marriage : సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఫిదా’ ద్వారా తెరంగేట్రం చేసిన ఆమె ప్రయాణం బాగానే సాగుతోంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ కాలం గుర్తుండిపోయే క్యారెక్టర్లలో నటించి మెప్పించింది. కొన్ని రోజులుగా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. గతంలో వృత్తి రిత్యా డాక్టర్ అయిన ఆమె హాస్పిటల్ పెట్టబోతోందని పుకార్లు వచ్చినా.. అటు వైపు అడుగుపడిందా? లేదా? తెలియలేదు. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి చేసుకుందన్న వార్తలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో దండలు వేసుకొని ఉన్న ఆమె ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. ఆమె భర్త పేరు గురించి ఇటీవల  సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చలకు దారి తీశాయి. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామిని ఆమె పెళ్లి చేసుకుందన్న కథనాలు వినిపించాయి. అయితే ఆమె ఫొటోను ఎడిట్ చేసిన వైరల్ రాయుళ్లు రాజ్ కుమార్ తో సాయి పల్లవి వివాహం జరిగిందని కథనాలు సృష్టించారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు.

శివకార్తికేయన్‌తో కలిసి నటించబోయే చిత్రం ‘#SK 21’ ముహూర్తం ఇటీవల నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి, సాయి పల్లవి మెడలో పూల దండలు వేసుకొని ఫొటో దిగారు. ఇది అసలు పెళ్లి ఫొటో కాదని, సినిమా వేడుకలో తీసిందిని ఆయన స్పష్టం చేశారు.

9 మే, 1992 తమిళనాడులో జన్మించిన సాయి పల్లవి మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటి. ఆమె డాక్టర్ విద్య చదివినా, డాన్స్, నటనలో రాణించాలని అనుకుంది. తన చిన్నతనంలోనే ‘కస్తూరి మాన్’ (2005) మరియు ‘ధామ్ ధూమ్’ (2008) వంటి తమిళ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు వేసింది. ‘ఉంగలిల్ యార్ అడుత ప్రభుదేవా’, ‘ఢీ: అల్టిమేట్ డ్యాన్స్ షో’ల పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది.

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ (2015)లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా బాక్సాఫీస్ హిట్ కావడంతో ఇందులో ఆమె నటనకు స్టార్ డమ్ వచ్చింది. ప్రేమమ్ లో తన పాత్రకు ఫిలింఫేర్ ఉత్తమ మహిళా డెబ్యూ (సౌత్) అవార్డు అందుకుంది. ఆ తర్వాత కూడా ఆమె చాలా అవార్డులు దక్కించుకుంది.