Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పూర్తిగా ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈరోజుతో ఆయన బాగా కోలుకున్నారు. ఈ మేరకు ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని తెలిసింది. కరీనా కపూర్ ఖాన్ ఆదివారం బాంద్రా వెస్ట్‌లోని లీలావతి హాస్పిటల్‌లో వారి పిల్లలు, తైమూర్ , జెహ్ అలీ ఖాన్‌లతో కలిసి సైఫ్ అలీ ఖాన్‌ను పరామర్శించారు.
కరీనా కపూర్ ఖాన్ తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి బెడ్ మీద ఉన్న మొదటి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు, ఇది వైరల్ అవుతుంది.
బాంద్రాలోని సైఫ్ అలీఖాన్‌కు చెందిన సద్గురు శరణ్ భవనంలో బుధవారం రాత్రి దోపిడీకి ప్రయత్నించిన ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఓ దొంగ సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ముంబై పోలీసులు బంగ్లాదేశ్ జాతీయుడైన ప్రధాన నిందితుడు మొహమ్మద్ షరీఫ్ అలియాస్ విజయ్ దాస్‌ను అరెస్టు చేశారు. అతడిని ఐదు రోజులుగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.