
Rinku Rajguru : దేశ వ్యాప్తంగా లవ్ స్టోరీ సినిమాలకు ప్రేక్షకులు నీరాజనం పడుతూనే ఉంటారు. ఎన్నో లవ్ స్టోరీ కథలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో సైరాట్ అనే మరాఠీ మూవీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మూవీ 2016 లో చిన్న సినిమాగా విడుదలై సెన్సెషనల్ హిట్ అందుకుంది. ఒక క్యూట్ లవ్ స్టోరీ లో జమీందార్ అమ్మాయి.. తక్కువ కులం అబ్బాయి మధ్య ప్రేమ, పెళ్లి అనంతరం కులం పిచ్చి కారణంగా ఇద్దరినీ చంపేయడం ఇలా ఒక్కో ట్విస్టు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఈ మూవీలో నటించిన హిరో, హిరోయిన్ల జీవితాలను మార్చేసింది సైరాట్ మూవీ.
సైరాట్ మూవీని నాగరాజు మంజులే డైరెక్షన్ చేశారు. ప్రతి సీన్ ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. పాటలు కూడా యువతరాన్ని ఆకట్టుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఎంజాయ్ చేశారు. హిరోగా ఆకాశ్ థోసర్, రింకు రాజ్ గురు అనే అమ్మాయి హిరోయిన్ గా నటించారు. రింకు రాజ్ గురు ఈ సినిమా చేసే సమయంలో కేవలం పదో తరగతి మాత్రమే చదువుతోంది. కానీ ఆమెను హిరోయిన్ గా పెట్టి సినిమా తీసి నాగరాజు మంజులే విజయం సాధించారు.
ప్రస్తుతం సైరాట్ హిరోయిన్ రింకు రాజ్ గురు ఎక్కడుంది. ఏం చేస్తుందంటూ ప్రేక్షకులు గూగుల్ లో వెతుకుతున్నారు. ఈ మూవీ తర్వాత రింకు బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. ఝుండ్ అనే మూవీలో హిందీలోకి ప్రవేశించింది. లారాదత్తాతో కలిసి హండ్రెడ్ అనే ఓటీటీ మూవీ కూడా చేసి ఆకట్టుకుంది.
ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అని అంతా ఆసక్తిగా నెట్టింట గాలిస్తున్నారు. అయితే సైరాట్ మూవీ సమయంలో చాలా క్యూట్ గా కనిపించిన ఈ భామ, ఇప్పుడు చాలా గ్లామర్ గా కనిపిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఏంటీ ఈ ముద్దుగుమ్మ ఇంతలా మారిపోయిందేంటి అని అందరూ చర్చించుకుంటున్నారు.
View this post on Instagram