
Sajjala fire : హైదరాబాద్ లో విచారణకు రావాలని అవినాశ్ రెడ్డిని సీబీఐ ఈ నెల 19 (శుక్రవారం) రోజును నోటీసలు ఇచ్చింది. అయితే అవినాశ్ రెడ్డి విచారణకు వెళ్తున్న సమయంలో ఆయన తల్లికి గుండెపోటు రావడంతో వెనక్కి వెళ్లాడని ఆయన దాదాపుగా హైదరాబాద్ రీచ్ అయ్యే సరికి ఆయనకు విషయం తెలిసి తిరిగి పులివెందుల వెళ్లాడని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. దీనిపై మీడియా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని ఇది కరెక్టర్ కాదని ఆయన అన్నారు.
అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడని ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కానీ కొన్ని మీడియా సంస్థలు కావాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ లోని విచారణకు బయల్దేరిన అవినాశ్ రెడ్డికి తన తల్లి హార్ట్ఎటాక్ ఫోన్ రావడంతో తిరిగి వెళ్లాడని సజ్జల చెప్పుకచ్చారు. అవినాశ్ తండ్రి కూడా లేకపోవడంతో తనే చూసుకునేవాడని అందుకే వెళ్లి ఉంటాడని ఆయన అన్నారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో వార్తలు ఇస్తున్నాయి. ఆయన తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారన్నారు. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
ఇంత సున్నితమైన అంశాన్ని కూడా మీడియా రచ్చరచ్చ చేయడం సరికాదన్నారు. రామోజీ, రాధాకృష్ణలపై సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు. వివేకా హత్యలో అవినాష్ పాత్ర ఉంటే ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వదిలేసేవాడా..? అని ప్రశ్నించారు. ఐదు సార్లు సీబీఐ ఎదుట హాజరైన అవినాశ్ ఇప్పుడెందుకు తప్పించుకోవాలని అనుకుంటాడు..? అని అన్నారు. సీబీఐ ఎదుటకు రేపయినా వెళ్లాల్సిందేగా కదా అన్నారు. తానే హత్య చేశానని చెప్పిన వాడు రోడ్డుపై తిరుగుతున్నాడు. ఒక ఎంపీని సీబీఐ వెంటాడుతుందని మండిపడ్డారు. ఒక వేళ ఎక్స్ ట్రీమ్‌గా వ్యవహరించినా ఫేస్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా మీట్ లో వివరించాడు.