
Sajjanar : ప్రస్తుతం ఐపీఎల్ సమరం నడుస్తోంది. పలు సంస్థలు ఇందులో పెట్టుబడి పెడుతున్నాయి. ప్రజలను మోసగించే వాటిని సైతం సభ్యులుగా చేర్చుకుంటున్నారు. గొలుసుకట్టు విధానంలో పలు సంస్థలు ప్రజలను తప్పుదారి పట్టించినా వాటిని భాగస్వాములుగా చేసుకోవడంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశ్నించారు. రాజ్యాంగ సంస్థలుగా చలామణి అవుతున్న వారు కూడా ఇలాంటి చీప్ సంస్థలను అక్కున చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆటలో నైతికత ఉండటం లేదు. పేరుమోసిన బడా సంస్థలు సైతం తప్పుడు దారుల్లో ఇలా బోగస్ సంస్థలను తమ అక్కున చేర్చుకోవడం విడ్డూరం. కోట్టు కుమ్మరించి అఫిషియల్ పార్ట్ నర్ హోదా దక్కించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో సజ్జనార్ కంపెనీలు పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. ప్రజలను మోసం చేసిన వారికి అందలాలు ఎక్కించడం ఎంతవరకు సమంజసం.
ఐపీఎల్ లో ప్రస్తుతం ఫైనల్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సమరం తుది అంకానికి చేరుకుంది. యాజమాన్యం మాత్రం నైతికత పాటించకుండా మోసాలకు పాల్పడిన వారికి సముచిత స్థానం ఇవ్వడంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. హెర్బల్ లైఫ్ లాంటి బోగస్ సంస్థలను ఐపీఎల్ లో భాగం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రజల జీవితాలతో ఆడుకునే సంస్థలకు స్థానం ఇవ్వడంపై సంశయం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2023లో హెర్బల్ లైఫ్ సంస్థ బీసీసీఐకి భాగస్వామ్యంగా వ్యవహరిస్తోంది. బెట్టింగ్ యాప్స్ తో ప్రజలను బురిడీ కొట్టించిన సంస్తలతో యాజమాన్యం కుమ్మక్కు కావడంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సజ్జనార్ లేవనెత్తిన ప్రశ్నలకు ఎలాంటి స్పందనలు వస్తాయో తెలియడం లేదు. కానీ ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన సంస్థలకు మద్దతు ఇవ్వడం ఏమిటని నెటిజన్లు సైతం అడుగుతున్నారు.