మీడియా, సినీ ఇండస్ట్రీలో పరిచయం ఉన్న వ్యక్తి ప్రియదర్శిని రామ్. ‘సాక్షి’ పేపర్, టీవీ ఛానల్ కు ఎడిటర్ గా కొన్ని సంవత్సరాలు విధులు నిర్వహించారు. దాదాపు రెండు సార్లు ఛానల్ నుంచి బయటకు వెళ్లిన ఆయన రెండు సార్లు కూడా తిరిగి మళ్లీ ఛానల్ కు వచ్చారు. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
ప్రియదర్శిని రామ్ సినీ ఇండస్ట్రీతో పాటు మీడియా రంగంలో చాలా విభాగాల్లో పని చేశారు. మొదట ఆయన కెరీర్ యాడ్స్ తో ప్రారంభమైంది. రామ్ ఆలోచనలు ఎప్పుడూ విలక్షణంగా ఉండేవి. కాలేజీ రోజుల నుంచే భిన్నమైన వ్యక్తిగా ఉన్నారు ఆయన చదువు పూర్తవగానే ఎంఎన్‌సీ కంపెనీలకు యాడ్స్ చేయించేవాడు రామ్. ‘గ్రే అమెరికా’ అనే బడా సంస్థలో యాడ్స్ చేసేందుకు ఆయన కాంట్రాక్ట్ వరకు వెళ్లాడు. అప్పటి వరకు హైదరాబాద్ లోనే కొనసాగిన కంపెనీ సడన్ గా ముంబైకి తరలించాల్సి వచ్చింది. దీంతో ఒంటరి అయిన ఆయన తల్లిని విడిచి ఉండలేక రామ్ వెళ్లలేదు. ఆ తర్వాత డైరెక్షన్ వైపు దృష్టి పెట్టారు ప్రియదర్శిని రామ్. దూరదర్శన్ లోని డిటెక్టివ్ సీరియల్ కు దర్శకత్వం వహించి, నటించారు ఆయన. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో గెస్ట్ ఆర్టిస్ట్ గా కనిపించాడు రామ్.
సాక్షి మీడియాకు ప్రియదర్శిని రామ్ ఎడిటర్ బాధ్యతలను తీసుకున్నారు. ఆయన ఏ బాధ్యతలు తీసుకున్నా నిబద్ధతతో కట్టుబడి పని చేస్తారు. దీని కోసం ఆయన ఎంతటి వారినైనా ఎదిరిస్తారు. లేదంటే విడిచి వెళ్లిపోతారు. ఆయన సాక్షిని విడిచి రెండు సార్లు వెళ్లిపోయి మళ్లీ తిరిగి వచ్చారు. ఆ విషయాల గురించి చెప్పారు.
అసలు ఏం జరిగిందంటే.. ఆయన మాటల్లోనే..
‘వైఎస్ జగన్ కొత్తగా పార్టీ పెట్టిన రోజుల్లో బైఎలక్షన్ జరిగింది. ఆ సమయంలో పార్టీకి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే జగన్ ఇల్లు కింద ఒక ఆఫీస్ ఓపెన్ చేశాం. ఎలక్షన్ రిజల్ట్ రోజు కావడంతో రాత్రంతా పని చేసిన నేను ఉదయం 5 గంటల వరకే చేరుకున్నా. ఆ సమయంలో అవుట్ పుట్ ఎడిటర్ మెల్లగా ఉదయం 8.30 నుంచి 9 గంటలకు వచ్చాడు. ఆయనను పిలిచి వద్దు నువ్వు అవుట్ పుట్ ఎడిటర్, కొంచెం ఆగు అన్నా.. అయితే ఈ విషయం మేనేజ్ మెంట్ కు చెప్పనే లేదు. ఈ విషయం సజ్జల రామకృష్ణారెడ్డికి ఇబ్బందిగా అనిపించింది. ఆయన నన్ను రూముకు పిలిపించుకొని అంత పెద్ద హోదాలో ఉన్నవాడిని పక్కన పెట్టడం సరికాదని చెప్పారు.
సార్ నన్ను తీసుకువచ్చింది రాజశేఖర్ రెడ్డి. జగన్ రెడ్డి ఎన్నికలకు పోయాడని రిజల్ట్స్ కాబట్టి అందరం కలిసి పని చేయాలని తీసుకున్న నిర్ణయం దీనికి ఆయన కలిసి రాలేదు. బ్రెస్, పేస్ట్ తో వచ్చాను. నేను చేసిన సండే బుక్ వరకు మొత్తం ఇచ్చాను దీన్ని వాడుకోండి అని చెప్పాను. సజ్జల తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పాడు. కానీ ఒక్కసారి ఆలోచన వస్తే ఆగదు. అందుకే నేను వెళ్లిపోతున్నా అని చెప్పి వెళ్లిపోయాను. ఇక ఉదయాన్నే జగన్ ఇంటికి పిలిపించుకొని మాట్లాడి జాబ్ లోకి పంపించారు. రెండో సారి విజయమ్మ నచ్చ జెప్పడంతో తిరిగి జాయిన్ కావాల్సి వచ్చింది. వైఎస్ కుటుంబం ఎవరినీ వదులు కోదు’. అని చెప్పుకచ్చారు రామ్.