Salar Teaser Review :
అందరు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సలార్ టీజర్ విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు పెరిగాయి. సలార్ టీజర్ చూస్తుంటే అచ్చం కేజీఎఫ్ చూస్తున్నట్లే ఉంది. ఇది కేజీఎఫ్ కు కొనసాగింపు అని అంటున్నారు. ఏది ఏమైనా దీనిపై ప్రభాస్ ఎన్నో ఆశలు పెంచుకున్నారు.
కేజీఎఫ్ కు సలార్ కు సంబంధ ఉందా? రెండు చిత్రాలు ఒకేలా ఉంటాయా? దర్శకుడు ఏం చెప్పబోడుతున్నాడు? టీజర్ లో ఏం కనిపించలేదు. దర్శకుడి మార్కు మాత్రం కనిపించించింది. సెప్టెంబర్ 28న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇందులో జగపతిబాబు, పృథ్వీరాజ్, సుకుమారన్, టిల్లు ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్.
సలార్ విషయంలో సందిగ్గం కొనసాగుతోంది. కథలో రాఖీ భాయ్ మరణించిన నేపథ్యంలో సలార్ ఉద్యమం మొదలవుతుంది. దీనికి సంబంధించిన టీజర్ ఉదయం 5.12 గంటలకు విడుదల చేయడానికి కారణం అదేనని అంటున్నారు. కేజీఎఫ్ 2లో రాఖీ భాయ్ గోల్డ్ షిప్ మీద అటాక్ సమయంలో తెరపైకి వచ్చిన ఓ వాదనతో సలార్ మూవీ నడుస్తుందని చెబుతున్నారు.
సలార్ టీజర్ లో పులి, సింహం, ఏనుగు అడవిలో ఉంటే డేంజర్ కాననీ జురాసిక్ పార్కులో ఉంటే కాదని చెప్పడం చూస్తుంటే సినిమా తిరుగులేని ట్విస్ట్ లతో కొనసాగుతుందని తెలుస్తోంది. ప్రభాస్ కు ఇప్పటి వరకు వచ్చిన ప్లాపులతో విసిగిపోయిన రెబల్ స్టార్ నమ్మకాన్ని నిలబెడుతుందో లేదో సెప్టెంబర్ 28 వరకు వేచి చూడాల్సిందే మరి.