Salar Teaser : ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్ టీజర్ వచ్చేసింది. ఈ రోజు ఉదయం 5.12గంటలకు టీజర్ ను వదిలాడు మన నీల్ మావ. అయితే టీజర్ క్షణాల్లోనే రికార్డు వ్యూస్ తో దుమ్ములేపింది. ఇది చూసిన చాలామంది గూస్ బంప్స్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కానీ కొందరు ప్రభాస్ ఫ్యాన్స్, సామాన్య ప్రేక్షకులు మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఎందుకంటే సలార్ టీజర్ లో.. చాలా విషయాలు కేజీఎఫ్ ను పోలినట్టే ఉన్నాయి. టీజర్ కలర్,బ్లాక్ థీమ్, ప్రభాప్ ఎంట్రీ గురించి ఓ వ్యక్తి ఇంగ్లిష్ లో డైలాగ్ చెప్పడం.. ఆ ఎలివేషన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్లు, అందులో వాడిన వస్తువులు, నటీనటుల కాస్ట్యూమ్స్, ఆ దుమ్ము, ఆ ధూళి.. ఇలా ఒక్కటేమిటి అన్ని కేజీఎఫ్ తరహాలోనే ఉన్నాయి.
ఇది చూసిన వారంతా.. నీల్ ను ఆడేసుకుంటున్నారు. ఈ టీజర్ ను చూస్తుంటే.. కేజీఎఫ్ కు రీమేక్ లా సలార్ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు అయితే సలార్ కంటే కేజీఎఫ్ టీజరే బాగుందని చెబుతున్నారు. పైగా ప్రభాస్ లుక్ ను పూర్తిగా చూపించకపోవడం మరో మైనస్ అయిపోయింది.
అసలు ఈ టీజర్ లో కొత్తగా ఏం ఉందని చూడాలి అంటూ కామెంట్లత తిట్టిపోస్తున్నారు. హీరో ఫేస్ ఒక్కటే ఛేంజ్ అయింది తప్ప.. మిగతా దంతా కేజీఎఫ్ లాగానే ఉందని చెబుతున్నారు. ఆఖరకు కేజీఎఫ్ లో వాడిన కొన్ని డ్రమ్ములను ఇందులో కూడా వాడేశాడు ప్రశాంత్ నీల్. మరీ ఇంతలా దొరికిపోయేలా టీజర్ డిజైన్ చేశావేంటి నీల్ మావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ ట్రోల్స్ ను తిప్పికొడుతున్నారు. కావాలనే ప్రభాస్ హేటర్స్ నెగెటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారని చెబుతున్నారు. ఆదిపురుష్ టీజర్ పై కూడా ఇలాంటి నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. చూడాలి మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంటుందో.
ReplyForward
|