
Salman Khan : AR మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సికిందర్ చిత్రం, సల్మాన్ ఖాన్ భారీ రెమ్యూనరేషన్ (150 కోట్లు) తీసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. రంజాన్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే 30 కోట్ల నెట్ వసూళ్లు, ఫుల్ రన్‌లో 140 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. వరల్డ్‌వైడ్ గ్రాస్‌గా 200 కోట్లు రాబట్టినప్పటికీ, షేర్ లెక్కన కేవలం 135 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. ఇది సల్మాన్ రెమ్యూనరేషన్ కంటే తక్కువ కావడంతో, చిత్ర నిర్మాతలు నష్టాల పాలయ్యారు.