Salman Khan in Vinayaka Chavithi : సల్మాన్ ఖాన్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సోదరి ఇంట్లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశాడు. చెల్లెలు అర్పిత ఖాన్ ఇంట్లో వినాయక పూజ కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా మంది పాల్గొన్నారు. మేన కోడలు హయాత్ తో పాటు మంగళహారతి ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశాడు.
ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ కూడా ఉన్నారు. సలీంఖాన్, సుహాయీల్ ఖాన్, రిహన్, వరుణ్ శర్మ ,ఓర్లి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు భక్తి పాటలకు డ్యాన్స్ చేసి పండగలో మరింత జోష్ పెంచారు.
కాగా బిగ్ బాస్ 18 ప్రారంభమైంది . సల్మాన్ ఖాన్ ఇప్పటిదాకా ఆ కార్యక్రమానికి వ్యాఖ్యత గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు సికిందర్ సినిమా షూటింగ్లో జరిగిన గాయం గురించి తెలిపాడు. ఆ సినిమా షూటింగ్లో తన రెండు పక్కటేముకలు విరిగిపోయాయి అని పేర్కొన్నాడు. చాలా మంది జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్ త్రీ సినిమాలో నటించాడు. టైగర్ 3 సినిమా తర్వాత ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ మూవీలు రిలీజ్ కాలేదు. సికిందర్ మూవీ లో రష్మిక మందాన సత్యరాజ్ ప్రతీక బబ్బర్ లాంటి అగ్రశ్రేణి నటులు నటిస్తున్నారు. ఈ మూవీ కోసం సల్మాన్ ఖాన్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. కండల వీరుడు ఇన్ని రోజులు కనిపించకపోవడానికి కారణం అందరూ ఏవో ఏవో పుకార్లు పుట్టించారు. కానీ అసలు నిజం తెలిసేసరికి అందరూ నోరెళ్ళ పెట్టారు. సల్మాన్ ఖాన్ తొందరగా కోలుకొని మరింత ఊపు తో మంచి సినిమాలు తీయాలని ఆయన ప్రేక్షకులు కోరుతున్నారు.
Megastar #SalmanKhan #GaneshChaturthi pic.twitter.com/TtNTtksUiF
— Ifty khan (@Iftykhan15) September 8, 2024