
Salt is a health hazard : ప్రస్తుత రోజుల్లో ఉప్పు వాడకం పెరుగుతోంది. రుచికోసం ఉప్పును వాడుతున్నారు. ఫలితంగా అనేక ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. అన్ని వేసి చూడు నన్ను వేసిచూడు అని అన్నట్లు ఉప్పుతో కూరలకు రుచి వస్తుంది. కానీ ఉప్పుతో మన ఆరోగ్యానికి ముప్పు అనే సంగతి పట్టించుకోవడం లేదు. దీంతో పలు రోగాలకు కారణంగా నిలుస్తున్నారు.
ఉప్పు మోతాదుకు మించితే నష్టమే. ఉప్పును మొత్తం మానేస్తేనే మంచిది. కానీ ఎవరు పట్టించుకోరు. ఈ నేపథ్యంలో ఉప్పు వాడకాన్ని దూరం చేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. ఉప్పు ఎక్కువైతే రక్తపోటు సమస్య వస్తుంది. అధిక రక్తపోటు వల్ల చాలా సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దాహం విపరీతంగా వేస్తుంది. దీంతో మూత్రవిసర్జనకు కూడా ఎక్కువమార్లు వెళ్లాల్సి వస్తుంది. ఉప్పు వినియోగం తగ్గిస్తేనే మంచిది. వైద్యుల సలహా మేరకు నడుచుకుంటే ఉప్పు వల్ల అనర్థాలు రాకుండా ఉంటాయి. ఉప్పును వాడకుండా ఉంటే మనకే లాభాలు వస్తాయి.
ఉప్పు తీసుకుంటే తలనొప్పి బాధిస్తుంది. ఉప్పు ఎక్కువగా తింటే సోడియం స్థాయి పెరుగుతుంది. ఉప్పు వాడకం వల్ల కాళ్లలో వాపు వస్తుంది. ఇలా మనకు కలిగే బాధలు దూరం కావాలంటే ఉప్పును శాశ్వతంగా దూరం చేసుకోవాల్సిందే. దీనికి అందరు కట్టుబడాల్సిందే.