Salutations to Guru : ముక్కోటి దేవతలు, త్రిమూర్తుల కంటే కూడా గురువు గొప్పవాడు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దేవతలు ఇచ్చిన శాపాన్ని గురువు పరిసంహరిస్తాడని, కానీ గురువు శాపాన్ని దేవతలు కూడా పరిసంహరించలేరు. గురు వాక్కు అంత పవర్ ఫుల్ గా ఉంటుంది. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువును నిత్యం సమర్పించుకోవాల్సి. అప్పడే మన ఎదుగుదల ప్రారంభమవుతుంది. ‘గురువు లేని విద్య గుడ్డి విద్య’ అన్న చందం మనకు వాడుకలో ఉంది. ఎంతటి మేథావి అయినా.. ఎంతటి తెలివి తక్కువ వాడు అయినా.. గురువు వద్దే జ్ఞానం పొందాలి.
ఏకలవ్వుడు అంతటి వాడు ద్రోణాచార్యుడి విగ్రహం తయారు చేసుకొని గురువుగా ఆరాధిస్తూ విలు విద్యలు నేర్చుకున్నాడు. సాక్షాత్తు ద్రోణాచార్యుడు విద్య నేర్పిన అర్జునుడి కన్నా మరింత శక్తి వంతుడిగా మారాడు. గురువు విగ్రహమైనా మనలోని అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోలుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గురువు గురించి ఎన్నో కథలు ఉన్నాయి మన పురాణంలో. గురువు అనేవాడు మన అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోలే వ్యక్తి.
‘గురువుకు వందనం’ అనే కార్యక్రమాన్ని వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. తమ గురువు ఆచార్య బోడెపూడి ప్రసాద రావు (ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు)కు జీవన సాఫల్య ఆత్మీయ అభినందన ఏర్పాటు చేశారు శిష్యులు. ఈ కార్యక్రమం 11 అక్టోబర్, 2023వ తేదీ విశాఖపట్నంలోని వాల్తేర్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అల్పాహారం తర్వాత ఇష్టా-గోష్ఠి, 5.00 గంటలకు గురువందం ఉంటుంది.
గరువుకు వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత 13వ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, గౌరవ అతిథిగా మిజోరాం గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు పాల్గొననున్నారు. అత్మీలందరికీ ఆహ్వానం తెలిపారు. మరిన్ని వివరాలకు 9491126969, 9000410555లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.