
Samajavaragamana :
ప్రతీ వారం థియేటర్స్ లో సినిమాల సందడి ఉంటూనే ఉంటుంది.. అయితే ఈసారి శుక్రవారం కాకుండా బక్రీద్ కారణంగా ఒకరోజు ముందుగానే సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. మరి ఈ రోజు రిలీజ్ అయిన సినిమాల్లో సామజవరగమన మూవీ ఒకటి. ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు చూద్దాం..
నటీనటులు :
శ్రీవిష్ణు
రెబ్బ మౌనిక జాన్
వెన్నెల కిషోర్
నరేష్
రాజీవ్ కనకాల
రఘుబాబు
దేవి ప్రసాద్ తదితరులు..
సంగీతం : గోపి సుందర్
డైరెక్షన్ : రామ్ అబ్బరాజు
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత హీరోగా కూడా నటిస్తూ బిజీ స్టార్ అయిపోయాడు శ్రీవిష్ణు.. ఈయన హీరోగా చేసిన సినిమాలు కొత్తగా ఆకట్టుకుంటాయి కానీ కమర్షియల్ గా లాభాలను తెచ్చింది లేదు.. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఈ హీరోకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో ఈయన నటించిన రాజ రాజ చోరా, బ్రోచేవారెవరురా అనే మంచి హిట్స్ దక్కాయి. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా పేరు పొందలేదు. ఈసారి సామజవరగమన సినిమాతో తన లక్ ను పరీక్షించు కునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఇది ప్రీమియర్ షో నుండే మంచి టాక్ దక్కించుకుంది. దీని రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు చూద్దాం..
కథ : బాలు ( శ్రీవిష్ణు) మధ్యతరగతికి చెందిన అబ్బాయి.. ఈయన తాతయ్య తన తండ్రికి ( నరేష్) డిగ్రీ పట్టా పొందితేనే ఆస్తి మొత్తం తనకు చెందుతుంది అని పట్టా రాయించడంతో బాలు ఆ ఆస్థి కోసం తన తండ్రిని డిగ్రీ పాస్ చేయించాలని చూస్తాడు.. ఇక బాలుకి ప్రేమ అంటే అస్సలు నచ్చదు. అందుకే ఈయన ఐలవ్ యు చెప్పిన వారికీ రాఖీ కట్టేస్తూ ఉంటాడు. అలంటి వాడిని సరయు ( రెబ్బ మౌనిక జాన్) ప్రేమిస్తుంది. మరి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? తన తండ్రిని డిగ్రీ పాస్ చేయించాడా? అనేది మిగిలిన కథ..
పర్ఫార్మెన్స్ : శ్రీవిష్ణు ఎప్పటిలాగానే తన నటనను 100 శాతం కనబర్చి మెప్పించాడు. డైరెక్టర్ సింపుల్ కథను కూడా చాలా చక్కగా మలిచి ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు. రామ్ అబ్బరాజు ఈ విషయంలో విజయం సాధించాడు. ప్రతీ నటుడు నుండి వినోదం పండేలా చేసి కడుపుబ్బా నవ్వించాడు. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూడగలిగేలా ఉంది. అందరి నటీనటుల పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. నరేష్ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు.
చివరి మాట : ఈ సినిమా కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ప్రేక్షకులు కుటుంబం మొత్తంతో కలిసి ఏ మాత్రం సంకోచం లేకుండా చూడవచ్చు..
రేటింగ్ : 3 / 5