Samantha Dad Passes Away : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే అనేక సమస్యలతో సమంత సతమతవుతోంది. ఇలాంటి సమయంలో ఆమెను మరో విషాదం చుట్టుముట్టడం అందరనీ కలచివేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంతనే తన ఇన్ స్టాలో వెల్లడించింది. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఏమోజీ ని షేర్ చేసింది. సమంత తండ్రి మృతి వార్త అందరికీ తెలియడంతో పలువురు సెలబెట్రీలు, అభిమానులు ఆమెను సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి కష్ట సమయంలో సమంత మరింత ధైర్యంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఏదిఏమైనా సమంత తన తండ్రిని కోల్పోవడంతో ఆమెకు ఉన్న తోడును కోల్పోయిందంటూ అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.