Samantha : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్న సమంతా రూత్ ప్రభు ప్రేమ వ్యవహారంలో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమెకు జోడీగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు పేరు వినిపిస్తోంది. ఇద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సమంత, రాజ్ కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్‌లో కనిపించడమే కాకుండా, పలువురు సెలబ్రిటీల బర్త్ డే పార్టీలు, మ్యారేజ్ ఈవెంట్లలో కూడా కలిసి దర్శనమిచ్చారు. సమంత సినీ రంగ ప్రవేశానికి 15 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా జరిగిన అవార్డ్ ఫంక్షన్‌లో రాజ్ కూడా పాల్గొనడం గమనార్హం. వీటన్నింటి నుంచి ఈ జంట మధ్య బంధం కేవలం స్నేహానికే పరిమితం కాదని అభిమానులు అంచనా వేస్తున్నారు.
తాజాగా ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని గాసిప్ మేధావులు ప్రచారం చేస్తున్నారు. సమంత, రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్నదీ, త్వరలోనే అతడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నదీ వార్తల సారాంశం. అయితే ఇప్పటివరకు సమంతా, రాజ్ ఈ విషయంపై స్పందించలేదు.
ఇదిలా ఉండగా, రాజ్ నిడిమోరు ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’, ‘గన్స్ & గులాబ్స్’ వంటి హిట్ సిరీస్‌లను తెరకెక్కించిన దక్షిణాది దర్శకుడు. సమంతతో ఆయనకు పరిచయం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సెట్‌లో మొదలై స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారినట్లు చర్చలు సాగుతున్నాయి.
ఇక సమంత మాజీ భర్త నాగచైతన్య ఇటీవలే శోభితను పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. దీంతో సామ్ కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన వస్తుందో లేదో వేచి చూడాలి.