Samantha :
ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం చాలా మందికి చేతకాదు. భయపడుతుంటారు. అవతలి వారు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఎవరు కూడా ముందర అనరు కానీ వెనక మాత్రం ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు. ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొట్టడం అందరికి సాధ్యం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. ఎదుటి వారిని మెప్పించాలి. ప్రస్తుతం సమంత అదే కోవలోకి వస్తుంది.
మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో అప్పట్లో వన్ నేనొక్కడినే అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సముద్ర తీరంలో నడుస్తుంటే అతడి అడుగులకు వెనక తన చేతులు తగిలిస్తుంటుంది. సమంత దీనిపై స్పందించింది. ఆడవారిని ఆటబొమ్మలుగా చూపే ఇలాంటి దృశ్యాలు అభ్యంతరకరమని అప్పట్లో తన నిరసనను చాటింది.
మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ముమ్మాటికి ఇది పురుష దురహంకార ప్రపంచమని ఏకి పారేసింది. అప్పట్లో ఇదిపెద్ద వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో గతంలో విజయ్ దేవర కొండతో ఓ సినిమాలో సమంత చేతులను విజయ్ తన కాళ్లతో తాకుతాడు. మరి దీనికి ఏం చెబుతావని ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ సమంతతో ఆడుకుంటున్నారు.
అందుకే మన పెద్దలన్నారు చెరపకురా చెడేవు. మనం ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లు సమంత ఏదో చెప్పాలనుకుంటే మరేదో తన కాలికి తగిలినట్లు అయింది. ఇలా తాను చేయని తప్పుకు సమంత బాధ్యురాలిగా నిలవడం గమనార్హం. ఏ విషయంపై కూడా అనవసరంగా నోరు పారేసుకోవద్దు. తరువాత మనకే అది నష్టం తీసుకొస్తుందని తెలుసుకుంటే మంచిది.