Samantha’s sensational decision :
సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.. ఈమె తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈ భామ నాగ చైతన్యను పెళ్లి చేసుకుని, నాలుగేళ్లకే విడాకులు జరిగి లైఫ్ లో డిస్టబెన్స్ రావడంతో ఈమె బాగా స్ట్రెస్ కు గురి అయ్యి గత ఏడాది మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది.
ఈ విషయాన్నీ ఈమె సోషల్ మీడియా వేదికగా రివీల్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఎవరి సహాయం లేకున్నా ఒంటరిగా పోరాడుతూ మళ్ళీ మాములు స్థితికి చేరుకొని ఈ మధ్యనే మళ్ళీ షూట్స్ చేస్తూ బిజీ అయ్యింది. అయితే ఈ ప్రాజెక్ట్స్ ఈమె ఈ వ్యాధికి ముందు ఒప్పుకున్నవే.. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ అంగీకరించలేదు..
ఇప్పుడు ఖుషి షూట్ తో పాటు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. వీటి తర్వాత మరో ప్రాజెక్ట్ మీద సైన్ చేయలేదు.. అందుకు ఒక కారణం ఉందని ఇప్పుడు తెలుస్తుంది.. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాత ఈమె సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అది కూడా ఏడాది పాటు అని తెలుస్తుంది. ఈ షాకింగ్ డెసిషన్ ను విన్న ఆమె ఫ్యాన్స్ మరింత షాక్ అవుతున్నారు.
సమంత మాయోసైటిస్ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటుంది.. మరి ఆ తర్వాత ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని దీనికి అవసరమైన అదనపు చికిత్స కోసం ఈమె ఈ నిర్ణయం తీసుకుందట. దీంతో ఈ భామ ఆరోగ్యం మళ్ళీ మాములు స్థితికి చేరుకున్న తర్వాతనే సినిమాలకు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.. చూడాలి ఎప్పటి వరకు సామ్ సినిమాలకు బ్రేక్ ఇస్తుందో.